Vavilaku : మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల గురించి మనలో చాలా మందికి తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అయితే ఆ మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అటువంటి మొక్కలలో వావిలాకు ఒకటి. ఈ వావిలాకు గురించి మన పెద్ద వారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు. ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గుతాయని మన పెద్దవారు వావిలాకును ఉపయోగించేవారు. వావిలాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ళవాపు, కీళ్ల నొప్పులు తగ్గటానికి ఈ వావిలి ఆకులు చాలా బాగా సహాయపడతాయి.
దీనికోసం ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని కాస్త వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పులు, అలాగే వాపు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. వావిలాకు పొడి మార్కెట్లో లభ్యం అవుతుంది. ఆయుర్వేద షాపుల్లో అలాగే ఆన్‌లైన్ స్టోర్ లలో కూడా దొరుకుతుంది. అర టీస్పూన్ పొడిని 2 కప్పుల నీటిలో కలిపి సగం నీరు అయ్యేవరకు ఉడికించి వడగట్టి తాగితే దగ్గు, గొంతు చికాకు, జ్వరం వంటివి తగ్గిపోతాయి. నువ్వుల నూనె, వావిలాకు రసం కలిపి పొయ్యి మీద పెట్టి నీరు అంతా ఇగిరిపోయేదాకా మరిగించాలి.
ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పులు, అన్ని రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వావిలాకును ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…