Birth Number : మీకు బర్త్ నంబర్ కాలిక్యులేట్ చేయడం ఎలాగో తెలుసు కదా..? ఏమీ లేదండీ.. ఉదాహరణకు మీరు ఏ నెలలో అయినా 1వ తేదీన పుడితే అదే మీ బర్త్ నంబర్ అవుతుంది. మరి 29వ తేదీన పుట్టారనుకోండి, అప్పుడు మీ బర్త్ నంబర్ ఏది అవుతుంది..? దాన్ని ఇలా లెక్కించాలి. ఈ సంఖ్యలో ఉన్న రెండు అంకెలను కలపాలి. 2+9=11 అవుతుంది. మళ్లీ 11 సంఖ్యలో ఉన్న రెండు నంబర్లను కలపాలి. అప్పుడు 1 + 1 = 2 అవుతుంది. అంటే 29వ తేదీన మీరు పుడితే అప్పుడు మీ బర్త్ నంబర్ 2 అవుతుందన్నమాట. ఇలాగే ఏ తేదీన పుట్టినా లెక్కించాల్సి ఉంటుంది.
అయితే ఇంతకీ ఏంటీ విషయం..? అంటారా..? ఏమీ లేదండీ.. బర్త్ నంబర్ ప్రకారం కింద ఇచ్చిన కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే దాంతో అదృష్టం కలసి వస్తుందట. విజయాలు వెన్నంటి ఉంటాయట. అంతా మంచే జరుగుతుందట. మరి ఎవరి బర్త్ నంబర్ ప్రకారం వారు పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దామా..?
బర్త్ నంబర్ 1 అయితే.. 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 1 అవుతుంది. వీరు తమ ఇల్లు లేదా ఆఫీస్‌లో ఫ్లూట్‌ను పెట్టుకోవాలి. ఇలా చేస్తే అదృష్టం కలసి వస్తుందట. బర్త్ నంబర్ 2 అయితే.. 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 2 అవుతుంది. వీరు తెలుపు రంగు షో పీస్‌ను ఇంట్లో ఉత్తరం-దక్షిణం దిశగా పెట్టుకోవాలి. బర్త్ నంబర్ 3 అయితే.. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 3 అవుతుంది. వీరు రుద్రాక్షను (మాల కాదు) ఇంట్లో ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా చేస్తే అంతా శుభమే జరుగుతుందట. బర్త్ నంబర్ 4 అయితే.. 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 4 అవుతుంది. వీరు పగలని గ్లాస్‌ను ఇంట్లో నైరుతి మూలన పెట్టాలి.
బర్త్ నంబర్ 5 అయితే.. 5, 14, 23 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 5 అవుతుంది. వీరు ఇంట్లో ఉత్తర దిశలో లక్ష్మీ లేదా కుబేరుని చిత్ర పటాన్ని పెట్టుకోవాలి. దీంతో ధనం వృద్ధి చెందుతుంది. బర్త్ నంబర్ 6 అయితే..
6, 15, 24 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 6 అవుతుంది. వీరు ఇంట్లో ఆగ్నేయ మూలన నెమలి ఈకలను ఉంచుకోవాలి. దీంతో ధనం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. బర్త్ నంబర్ 7 అయితే.. 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 7 అవుతుంది. వీరు ఇంట్లో ఆగ్నేయ మూలన రుద్రాక్షను పెట్టుకోవాలి. దీంతో లక్ కలసి వస్తుంది. అదృష్టం చేకూరుతుంది.
బర్త్ నంబర్ 8 అయితే.. 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 8 అవుతుంది. వీరు ఇంట్లో దక్షిణ దిక్కున నలుపు రంగు క్రిస్టల్‌ను పెట్టుకోవాలి. దీంతో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి అంతా మంచే జరుగుతుంది. బర్త్ నంబర్ 9 అయితే.. 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారి బర్త్ నంబర్ 9 అవుతుంది. వీరు ఇంట్లో దక్షిణ దిక్కున పిరమిడ్‌ను పెట్టుకోవాలి. దీంతో లక్ కలసి వస్తుంది. ఇలా బర్త్ నంబర్ల ప్రకారం ఆయా వస్తువులను ఇంట్లో పెట్టుకుంటే దీంతో ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు. నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదృష్టం కలసి ఉంటుంది. ఏదైనా సాధించగలుగుతారు. ధనం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…