ఆరోగ్యం

Thotakura : వారంలో 2 సార్లు తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Thotakura : ఆకుకూరలను తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చని ఆకుకూరల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఆకుకూరలను అసలు మానకుండా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు చాలా చవకగా ఎక్కువ పోషకాలతో దొరుకుతాయి. ఆకుకూరల్లో రారాజు తోటకూర. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ అన్ని రకాలలోనూ దాదాపుగా ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయి. తోటకూరతో చేసే వంటలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తోటకూరను తినటానికి చాలా మంది ఇష్టపడరు. ప‌స‌రు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చాలా మంది అనుకుంటారు.

కానీ అది నిజం కాదు. తోట‌కూర అలా అనిపిస్తుంది అంతే. ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి తోట‌కూర‌ను తింటే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తోటకూరలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి అత్యంత కీలకమైన విటమిన్ ఎ తో పాటు విటమిన్ కె, సి, బి6, ఫోలేట్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. తోటకూర శరీరానికి కావల్సిన శక్తిని సమకూర్చుతుంది. తోటకూర ఆకుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని సంపూర్ణ పోషకాహారంగా చెప్పవచ్చు. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీన‌త‌(అనీమియా)తో బాధపడేవారికి మంచి ఔషధంగా చెబుతారు.

Thotakura

రక్తహీన‌త‌తో బాధపడేవారు ప్రతి రోజు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆ సమస్య నుండి బయట పడతారు. ఆయుర్వేద మందుల్లో సైతం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. బరువు తగ్గాలని అనుకునే వారు రోజువారీ డైట్ లో తోటకూరను చేర్చుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. తోటకూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి కొవ్వును తగ్గిస్తుంది. తోటకూరలోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టు కుంటుంది. మాంసంకు స‌మానంగా ప్రోటీన్లు తోట‌కూర‌లో ఉంటాయి. తోట‌కూర తింటే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. శ‌రీరం దృఢంగా మారుతుంది. నిత్యం వ్యాయామం చేసేవారు తోట‌కూరను క‌చ్చితంగా తినాలి.

తోట‌కూర‌లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తుంది. ఎముక‌ల‌కు బ‌లం చేకూరుస్తుంది. ఎదిగే పిల్ల‌ల‌కు తోట‌కూర పెడితే వారిలో ఎదుగుద‌ల స‌క్ర‌మంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగస్తులకు తోటకూర చక్కటి ఔషధం. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ని స్థిమితంగా ఉంచడంలో తోటకూర దోహదపడుతుంది. దాంతో మధుమేహం అదుపులో ఉంటుంది. తోటకూరను వేపుడుగా కాకుండా కూరగా చేసుకుంటేనే తోటకూరలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందువ‌ల్ల తోట‌కూర‌ను తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM