Itchy Hands And Money : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాలకు చెందిన ప్రజలు పురాతన కాలం నుంచి నమ్ముతున్న విశ్వాసాలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నిజంగా నమ్మదగినవే అయి ఉంటాయి. అయినప్పటికీ కొందరు వాటిని నమ్మరు గాక నమ్మరు. అలాంటి నమ్మశక్యం గాని విశ్వాసాల్లో చేతుల దురద కూడా ఒకటి. అదేంటీ, చేతులకు దురద ఉంటే దాన్ని విశ్వాసం అంటారా..? అదొక నమ్మకమా..? అని ఆశ్చర్యపోకండి. మేం చెబుతోంది నిజమే. చేతులకు దురద కలిగితే దాన్ని బట్టి డబ్బు వస్తుందో, పోతుందో సులభంగా చెప్పేయవచ్చట. నమ్మశక్యంగా లేకున్నా ఈ విశ్వాసాన్ని పాటించేవారు కూడా చాలా మందే ఉన్నారు.
చేతులకు దురద కలిగితే డబ్బులు రావడం లేదా పోవడం అంశానికి సంబంధించిన కథ కూడా ఒకటి ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. అదేంటంటే మేరీ షామ్మాస్ అనే 73 ఏళ్ల ఓ వృద్ధురాలు ఒకప్పుడు బస్సులో ప్రయాణం చేస్తోందట. ఆ క్రమంలో ఆమె చేయి ఒకటి విపరీతంగా దురద పెట్టడం ప్రారంభమైందట. అనంతరం ఆమె బస్ నుంచి దిగాక ఓ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిందట. అందులో ఆమెకు 64 కోట్ల డాలర్ల లాటరీ తగిలిందట. అప్పటి నుంచి చేతులకు దురద పెడితే డబ్బులు వస్తాయని చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు.
అయితే ఏ చేయి దురద పెట్టినా డబ్బులు వస్తాయని అనుకోకూడదట. కేవలం కుడి చేయి దురద పెడితేనే, ఆ చేతిలో ఎక్కడైనా దురదగా ఉంటేనే డబ్బులు వస్తాయట. అయితే అలా చేయి దురద పెట్టినప్పుడు దాన్ని రుద్దకూడదట. అందుకు బదులుగా చేయిని మడవాలట. అప్పుడు డబ్బులు వస్తాయట. అనుకోకుండా ధనం కలసివస్తుందట. బయటి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనిషి లోపలికి వెళ్తుందట. అందుకే కుడి చేయిలో దురద పెడితే డబ్బులు వస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. కానీ ఎడమ చేయిలో దురద పెడితే మాత్రం డబ్బులు బాగా ఖర్చు పెడతారట. ఒంట్లో నుంచి పాజిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుందట. ఈ విషయంలో ఎవరి వాదనలు వారివే అయినా, మీకెప్పుడైనా అలా చేయిలో దురద పెడితే ఓసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. డబ్బులు ఖర్చు పెడుతున్నారో, లేదంటే డబ్బులు వస్తున్నాయో తెలిసిపోతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…