Taking Raw Egg : కోడి గుడ్లతో మనం రక రకాల వంటలు చేసుకుంటాం. కోడిగుడ్డ టమాటా.. కోడిగుడ్డు ఫ్రై.. కోడిగుడ్డు ఆమ్లెట్.. ఇలా కాకపోతే గుడ్డును ఉడకబెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొందరు గుడ్లను అలాగే కొట్టుకుని పచ్చిగా తాగేస్తారు. ఇది కొందరికి నచ్చదు. అయినా నచ్చిన వారి అలవాటును మనం కాదనలేం కదా. మరి అలా గుడ్డును అలాగే పచ్చిగా తింటే ఏం కాదా..? దాంతో ఇబ్బందేమీ ఉండదా..? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా..? అసలు గుడ్డును అలా పచ్చిగా తాగవచ్చా..? అంటే.. అందుకు ఎస్.. తాగవచ్చు.. అని సమాధానం వస్తుంది..! అవును, మీరు విన్నది కరెక్టే..! కానీ..! అందులో మనం పరిశీలించాల్సిన ఇంకో విషయం ఉంది..! అదేమిటంటే..!
కోడిగుడ్లను అలాగే కొట్టుకుని పచ్చిగా తాగవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది తాగే వారి ఇష్టం. అయితే పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా అని ఓ రకమైన బాక్టీరియా ఉంటుందట. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. ఈ క్రమంలో గుడ్డును బాయిల్ చేసి, లేదంటే దాంతో కూర వండుకుని తింటే ఓకే. ఆ బాక్టీరియా చనిపోతుంది. దాని వల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ కలగదు. కానీ.. గుడ్డును అలాగే పచ్చిగా తాగేస్తే దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.
అయితే ఆ బాక్టీరియా స్వల్ప పరిమాణంలో ఉంటుంది కనుక దాంతో మనకు ఏమీ కాదు. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వారు పచ్చి గుడ్లను తాగకూడదు. లేదంటే ఇన్‌ఫెక్షన్లు, జ్వరం వస్తాయి. ఇక గుడ్లను అలాగే పచ్చిగా తాగేవారైనా సరే వాటిని మరీ రెగ్యులర్‌గా అలా తాగవద్దట. ఎందుకంటే వారిలో బయోటిన్ అనే పోషక పదార్థ లోపం సంభవిస్తుందట. దీంతో చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు తెలిసిందా..! గుడ్లను పచ్చిగా తాగవచ్చో, తాగకూడదో..! కనుక ఇకపై గుడ్లను పచ్చిగా తాగాల్సి వస్తే ఈ సూచనలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…