ముఖ్య‌మైన‌వి

Tea spoon Vs Table spoon : టేబుల్ స్పూన్, టీస్పూన్ ఈ రెండింటికీ మ‌ద్య తేడా ఏంటి..? ఈ రెండిట్లో ఏది పెద్ద‌ది..?

Tea spoon Vs Table spoon : వంట‌ల ప్రోగ్రామ్ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ ఇదో పెద్ద డౌట్. అస‌లు టీస్పూన్ – టేబుల్ స్పూన్ అంటే ఏమిటి..? ఈ రెండింటికీ మ‌ద్య తేడా ఏంటి..? అని జుట్టు పీక్కున్న వారు చాలా మందే ఉన్నారు. అస‌లు ఏంటీ టేబుల్ స్పూన్ ? ఏంటీ టీస్పూన్.. ఈ రెండింటికీ మ‌ధ్య తేడాలు ఏమిటి.. ఏది పెద్ద‌ది.. అన్న విష‌యాల‌కు వ‌స్తే.. టేబుల్ స్పూన్ అనే ప‌దం 1700 సంవ‌త్స‌రంలో వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌ట్లో హోట‌ల్స్ కు కానీ, ఫంక్ష‌న్స్ కు కానీ వ‌చ్చే వారు త‌మ స్పూన్స్ ను తామే ఇంటి ద‌గ్గ‌రి నుండి తెచ్చుకునేవారట‌. ముఖ్యంగా స్వీట్స్ తినేందుకు, సూప్స్ తాగేందుకు వీటిని ఉప‌యోగించేవార‌ట‌. ఒక‌రి ఎంగిలి ఇంకొక‌రికి అంటొద్దు అనే ప‌ద్ద‌తిలో ఎవ‌రి స్పూన్స్ వారే తెచ్చుకునేవార‌ట‌.

కాల‌క్ర‌మేణా హోట‌ల్స్, ఫంక్ష‌న్స్ లో స్వీట్స్, సూప్స్ ను తీసుకునేందుకు ఉప‌యోగించే స్పూన్ల‌ను టేబుల్ మీదే అరేంజ్ చేయ‌డంతో దానికి టేబుల్ స్పూన్ అనే పేరు ఫిక్స్ అయిపోయింది. ఇలా అరేంజ్ చేసిన‌ప్ప‌టికీ చాలా రోజుల‌పాటు స్పూన్స్ ను ఇంటి ద‌గ్గ‌రి నుండే తెచ్చుకునేవార‌ట‌. త‌ర్వాత అక్క‌డే అరేంజ్ చేసిన టేబుల్ స్పూన్స్ కు అల‌వాటు ప‌డిపోయార‌ట‌. అలా క్ర‌మంగా ఇంటి ద‌గ్గ‌ర నుంచి స్పూన్స్‌ను తెచ్చుకోవ‌డం త‌గ్గింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..

Tea spoon Vs Table spoon

టీస్పూన్, టేబుల్ స్పూన్‌.. ఈ రెండింటిలోనూ టేబుల్ స్పూన్ పెద్ద‌ది అని చెప్ప‌వ‌చ్చు. 1 టేబుల్ స్పూన్ అంటే 3 టీస్పూన్ల ప‌రిమాణం వ‌స్తుంది. అలాగే 1 టీస్పూన్‌లో 5 ఎంఎల్ వ‌ర‌కు ప‌డుతుంది. అదే 1 టేబుల్ స్పూన్ అంటే 15 ఎంఎల్ వ‌ర‌కు ప‌రిమాణం ప‌డుతుంది. ఇలా ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాను మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. మ‌న ద‌గ్గ‌ర టీ అన‌గానే అల్రెడీ చ‌క్కెర క‌లిపిన టీ ని ఇస్తారు. కానీ ఇత‌ర దేశాల్లో టీ అంటే పాలు, డికాష‌న్ క‌లిపిన మిశ్ర‌మాన్ని మాత్ర‌మే ఇస్తారు. చ‌క్కెర‌ను విడిగా ఇస్తారు.

మ‌న‌కు కావాల్సిన మోతాదులో మ‌న‌మే చ‌క్కెర‌ను క‌లుపుకొని తాగాలి. సో అలా క‌లుపుకోడానికి వీలుగా ఓ స్పూన్ ను కూడా ఇస్తారు. దాన్నే టీ స్పూన్ అంటారు. ఇందులో 5 ఎంఎల్ ద్ర‌వం లేదా 5 గ్రాముల ఘ‌న ప‌దార్థం ప‌డుతుంది. అదే టేబుల్ స్పూన్ అయితే 15 ఎంఎల్ ద్ర‌వం లేదా 15 గ్రాముల వ‌ర‌కు ఘ‌న ప‌దార్థం ప‌డుతుంది. ఇలా ఈ స్పూన్ల‌ను ఉప‌యోగించుకోవాలి. క‌నుక ఇక‌పై టీస్పూన్‌, టేబుల్ స్పూన్ మ‌ధ్య తేడా ఏమిటి ? అని క‌న్‌ఫ్యూజ్ అవ‌కండి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM