ఆరోగ్యం

Banana : ఎంత లావు ఉన్నా.. అర‌టి పండును ఇలా తింటే ఏమీ కాదు.. నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు..!

Banana : అరటి పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు అరటిపండుతో చాలా ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు రోజూ ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అరటి పండు సంవత్సరం పొడవునా లభ్యం అయ్యి అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. ఈ పండులో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.

యాపిల్ కంటే అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డ‌డ‌మే కాదు, రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌ట్టుకోగ‌లిగే శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే కార్బొహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక మీడియం సైజ్ ఉన్న అర‌టి పండును తిన్నా చాలు.. మ‌న‌కు 110 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను తింటే లావుగా అయిపోతామేమోన‌ని అంద‌రూ భ‌య‌ప‌డుతుంటారు. నిజానికి ఈ విష‌యం క‌రెక్టే అయిన‌ప్ప‌టికీ లావుగా ఉన్న వారు కూడా అర‌టి పండును నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. అందువ‌ల్ల బ‌రువు ఏమీ పెర‌గ‌రు. కాక‌పోతే అందుకు ఒక నియమం ఉంటుంది. అదేమిటంటే..

Banana

లావుగా ఉన్న‌వారు రోజుకు ఒక మీడియం సైజ్ అర‌టి పండును తిన‌వ‌చ్చు. చిన్న‌వి అయితే రెండు తిన‌వ‌చ్చు. ఇక ఇలా అర‌టి పండ్ల‌ను తింటే ఇత‌ర ఆహారాల‌ను పూర్తిగా మానేయాలి. లేదా రోజూ తీసుకునే ప‌రిమాణం క‌న్నా కాస్త త‌గ్గించి తినాలి. ఉదాహ‌ర‌ణ‌కు రెండు అర‌టి పండ్ల‌ను తిన్నార‌నుకుందాం. క‌నుక రోజూ తినే అన్నం ప‌రిమాణాన్ని కాస్త త‌గ్గించాలి. స‌రిపోతుంది. ఇలా అర‌టి పండ్ల‌ను తింటే బ‌రువు పెర‌గ‌రు. పైగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి.

అరటి పండ్ల‌లో కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాక పొటాషియం, కాల్షియం అనేవి శరీరంలోని ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కీళ్ల మధ్య శబ్ధం తగ్గించటానికి సహాయపడతాయి. కీళ్లనొప్పులతో బాధపడేవారు ఆహార నియమాలు పాటించడంతోపాటు డాక్టర్ సూచించిన మందులు వాడాలి. అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్‌లు, ఎండు ఖర్జూరాలు వంటివి రెగ్యులర్ గా తీసుకోవాలి.

కీళ్ల నొప్పులు ఉన్నవారు వ్యాయామం కూడా చేయాలి. ఎందుకంటే అధిక బరువు కారణంగా బరువు కీళ్లపై పడి నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతి రోజూ కీళ్ల నొప్పులు ఉన్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ ఒక అరటి పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే లావుగా ఉన్న‌వారు మాత్రం పైన తెలిపిన విధంగా అర‌టి పండ్ల‌ను ఒక నియ‌మం ప్ర‌కారం తినాలి. దీంతో బ‌రువు పెరుగుతామేమోన‌ని బెంగ‌ప‌డాల్సిన ప‌ని ఉండ‌దు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM