Banana During Pregnancy : పురాతన కాలం నుంచి హిందువులు అనేక సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సైన్స్‌తోనూ ముడిపడి ఉంటాయి. అందువల్ల మన పెద్దలు ఏదైనా చెబితే దాన్ని కొట్టి పారేయకూడదు. అందులో సైన్స్ ఏముంది.. అని ఆలోచించాలి. ఒకవేళ అప్పటికీ ఏమీ తేలకపోతే దాన్ని కొట్టిపారేయవచ్చు. కానీ చాలా వరకు పురాణాలు, పెద్దలు చెప్పిన విషయాల్లో మాత్రం ఎంతో కొంత సైన్స్ దాగి ఉంటుందన్న విషయం మాత్రం వాస్తవం. ఇక సైన్స్‌తో ఎలాంటి సంబంధం లేకున్నా ఒక విషయాన్ని మాత్రం బాగా ప్రచారంలోకి తెచ్చారు. అదేమిటంటే..
గర్భంతో ఉన్న మహిళలు అనేక రకాల ఆహారాలను తింటుంటారు. అయితే వారు తినకూడని ఆహారాలు కూడా కొన్ని ఉంటాయి. కానీ కొందరు మహిళలు మాత్రం అరటి పండ్లను తినరు. గర్భంతో ఉన్న మహిళలు అరటి పండ్లను తినకూడదని వారు చెబుతారు. అందుకనే అరటి పండ్లను ఆ సమయంలో తీసుకోరు. అయితే పురాణాలలో ఈ విషయం ఎక్కడా లేదని పండితులు చెబుతున్నారు. కానీ ఆయుర్వేదం ప్రకారం అయితే అరటి పండ్లను తినడానికి ఒక నియమం ఉంది. అదేమిటంటే..
ఆయుర్వేదం ప్రకారం భోజనానికి ముందు ఉసిరికాయలను తినాలి. అలాగే భోజనం అనంతరం రేగు పండ్లను తినాలి. దీని వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. కొవ్వు పేరుకుపోదు. గ్యాస్, అజీర్ణం, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే భోజనానికి ముందు లేదా భోజనం తరువాత లేదా భోజనం చేసే సమయంలో.. ఎప్పుడైనా సరే అరటి పండ్లను మాత్రం తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఇది గర్భవతులకే కాదు.. అందరికీ వరిస్తుందట.
భోజనం సమయంలో అరటి పండ్లను తినడం వల్ల కఫం, వికారం పెరుగుతాయి. అందువల్ల అరటి పండ్లను ఆ సమయంలో తినరాదు. కొందరు పెరుగులో అరటి పండ్లను కలిపి తింటుంటారు. అలా చేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భోజనానికి కొన్ని గంటల ముందు లేదా తరువాత ఎప్పుడైనా సరే విడి సమయంలో అరటి పండ్లను నిక్షేపంగా తినవచ్చని.. గర్భవతులు కూడా ఆ సమయంలో వీటిని తీసుకోవచ్చని.. ఇందుకు ఎలాంటి నియమాలు లేవని ఆయుర్వేదం చెబుతోంది. కనుక అరటి పండ్లను తినేటప్పుడు ఈ నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఇక గర్భవతులు కూడా అరటి పండ్లను తినకూడదని అపోహను పెట్టుకోరాదు. పైన చెప్పిన విధంగా ఆయా సమయాల్లో అరటి పండ్లను తినవచ్చు. దీంతో బిడ్డకు కూడా పోషణ లభిస్తుంది. కనుక ఈ విధంగా వ్యవహరిస్తే అరటి పండ్లతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…