Heart Blocks : ఈ రోజుల్లో చాలామంది గుండెపోటుతో బాధపడుతున్నారు. హృదయ సంబంధిత సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే, గుండెపోటు వంటి బాధలు ఉండవు. మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కలగవు. ఎక్కువ మంది అధిక కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. కొవ్వు వలన గుండెకి దారి తీసే రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండెపోటుకు ఇది దారి తీస్తుంది.
గుండెపోటు ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. చాలామంది రోజూ ఓట్స్ ని తింటారు. ఓట్స్ వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని ఓట్స్ మెరుగుపరుస్తాయి. ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఓట్స్ తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ధమనుల్లో కొవ్వు నిల్వలకి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. కనుక నివారించాలంటే, రోజుకి ఒక్క సారైనా ఓట్స్ ని తీసుకోండి.
వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించి, రక్తపోటుని వెల్లుల్లి నియంత్రిస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు. వెల్లుల్లి రక్తనాళాల్లో అడ్డంకులపై ఎఫెక్ట్ చూపించి, గుండెపోటుని తగ్గిస్తుంది. కివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రక్తనాళాలలో కొవ్వులు పేరుకుపోకుండా ఇది చూస్తుంది. గుండెపోటు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది కివి.
కివి తీసుకోవడం వలన లివర్, కిడ్నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. బాదం, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా, వేరుశనగ వంటి నట్స్ ని తీసుకుంటే కూడా పేరుకుపోయిన కొవ్వుని తొలగించొచ్చు. రోజు కొంచెం నట్స్ ని తీసుకుంటే, తీవ్రమైన వ్యాధుల రాకుండా ఉండొచ్చు. దానిమ్మ కూడా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మలో శక్తివంతమైన ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇలా ఈ ఆహార పదార్థాలు మీరు తీసుకున్నట్లయితే, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…