Paneer Vs Egg : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగుండే విధంగా పాటిస్తున్నారు. చాలామంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని గుడ్డు, పన్నీర్ ని తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి రెండిట్లో ఏది మంచిది..? ఈ రెండిటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ లో ప్రోటీన్ తీసుకోవాలంటే, మనం గుడ్డు, పన్నీర్ వంటివి తీసుకుంటూ ఉంటాము.
గుడ్డు తినని శాకాహారులు ప్రోటీన్ కోసం పన్నీర్ ని ఎక్కువ తీసుకుంటుంటారు. మాంసాహారులైతే గుడ్డుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే, బరువు తగ్గాలనుకునే వాళ్ళు గుడ్డు తీసుకుంటే మంచిదా..? పన్నీర్ ని తీసుకుంటే మంచిదా అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. గుడ్డులో శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. గుడ్డులో తొమ్మిది గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
కొవ్వు శాతం గుడ్డులో ఎక్కువగా ఉంటుంది. 44 గ్రాముల గుడ్డులో 5.5 గ్రాములు ప్రోటీన్, 4.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలానే, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం ఇతర పోషకాలు కూడా బానే ఉంటాయి. అదే పన్నీర్ లో చూసుకున్నట్లయితే, 40 గ్రాముల పన్నీర్ లో 7.54 ప్రోటీన్ ఉంటుంది. ఐదు గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. అయితే గుడ్డు, పన్నీర్ రెండిట్లో కూడా ఒకే విధమైన పోషక విలువలు ఉంటాయి.
ప్రోటీన్ రెండిట్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. గుడ్డులో విటమిన్ బి12, విటమిన్ డి ఎక్కువ ఉంటాయి. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలని అనుకునేవాళ్లు, ఈ రెండిట్లో దేనినైనా తీసుకోవచ్చు. అయితే, శాకాహారులు గుడ్డును తీసుకోరు కాబట్టి పన్నీర్ ని తీసుకోవడం ఉత్తమం. బరువు తగ్గాలనుకునే శాకాహారులు పన్నీర్ తింటే, గుడ్డు తిన్న అంత ఫలితం ఉంటుంది. సోయా ఉత్పత్తులు, చిక్కుళ్ళు వంటివి తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగానే అందుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…