Sabja Seeds : సాధారణంగా వేసవి వచ్చిందంటే చాలు.. శరీరంలో వేడి ఇట్టే పెరిగిపోతుంది. వేసవి తాపానికి తట్టుకోలేకపోతుంటారు. ఇక త్వరలోనే వేసవి కూడా రానుంది. దీంతో శరీరాన్ని చల్ల బరుచుకునేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలను, శరీరానికి చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో సబ్జా గింజలు కూడా ఒకటి. అయితే వేసవి సంగతి పక్కన పెడితే కొందరికి శరీరంలో ఎల్లప్పుడూ వేడి ఉంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే ఈ వేడిని తగ్గించుకునేందుకు సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో విపరీతమైన వేడి కారణంగా చెమట, కళ్ళ మంటలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. శరీరంలో వేడి తగ్గించటానికి ఒక అద్భుతమైన డ్రింక్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా అలసట, నీరసం వంటివి అన్నీ తొలగిపోతాయి. సబ్జా గింజలు శరీరంలో వేడిని తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక బౌల్ లో ఒక టీస్పూన్ సబ్జా గింజలను వేసి నీటిని పోసి మూడు గంటలు నానబెట్టాలి. తర్వాత ఒక మిక్సీ జార్ లో అర టీస్పూన్ సొంపు, చిన్న పటికబెల్లం ముక్క, రెండు యాలకులు, చిటికెడు నల్ల ఉప్పు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి నానబెట్టిన సబ్జా గింజలు, మిక్సీ చేసిన పొడి, పది పుదీనా ఆకులను నలిపి వేయాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం, నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలిపి గ్లాసులోకి సర్వ్ చేయటమే. ఈ డ్రింక్ తాగితే శరీరంలో వేడి తగ్గటమే కాకుండా తలనొప్పి, ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఈ డ్రింక్ ను రోజు విడిచి రోజు తాగవచ్చు. అలాగే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ డ్రింక్ ను తాగితే చాలా రిఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. అలసట, నీరసం వంటివి వెంటనే తొలగిపోతాయి. ఇలా సబ్జా గింజలతో చేసిన ఈ డ్రింక్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…