ఆధ్యాత్మికం

Krishna And Arjuna : కృష్ణుడు, అర్జునుడు మంచి మిత్రులు.. మరి వారిద్దరూ ఎందుకు యుద్ధం చేశారు..? కారణం ఇదే..!

Krishna And Arjuna : శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కూడా ఒకటి. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తూ మహా విష్ణువు స్వరూపమే. చాలా శక్తివంతమైన ప్రజల కోరికలు తీర్చే దైవంగా కృష్ణుడు పూజలందుకుంటున్నాడు. అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు. ప్రపంచంలో బాణాలు వేసే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు లేడంటారు. అయితే మహాభారతంలో ఇద్దరూ మంచి స్నేహితులే కాదు, బావమరుదులు కూడా. కానీ అలా కలిసి ఉన్న వారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు తెలుసా. అవును, మీరు విన్నది నిజమే. శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఓ సారి యుద్ధం చేశారు. అప్పుడు ఏమైందంటే..

 అతని పేరు గయుడు. ఓ గంధర్వుడు. ఆకాశ మార్గంలో ఓ రోజున ప్రయాణిస్తూ కిందకు ఉమ్ముతాడు. అయితే అదే సమయంలో కింద నదిలో శ్రీకృష్ణుడు సంధ్యా వందనం చేస్తుంటాడు. దోసిలిలో నీటిని పట్టి సూర్యున్ని ప్రార్థిస్తుంటాడు. అదే సమయంలో గయుడు ఉమ్మి వేసే సరికి అది నేరుగా వచ్చి కృష్ణుని దోసిలిలో పడుతుంది. దీంతో శ్రీకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గయున్ని చంపేస్తానని ప్రతిన బూనుతాడు. అది తెలుసుకున్న గయుడు గజ గజ వణుకుతాడు.

Krishna And Arjuna

గయుడు వెంటనే నారదుని వద్దకు వెళ్లి సలహా అడుగుతాడు. అప్పుడు నారదుడు గయున్ని అర్జునుడి దగ్గరకు వెళ్లి మొదట శరణు కోరమని, తరువాతే కృష్ణుడి పేరు చెప్పమని అంటాడు. గయుడు అలాగే చేస్తాడు. మొదట అర్జునుడి వద్దకు వెళ్లి శరణు కోరుతాడు. అలా అర్జునుడి నుంచి గయుడు మాట తీసుకున్నాకే తనను కృష్ణుడు చంపుతానని చెప్పాడని, తనను కాపాడమని అర్జునున్ని వేడుకుంటాడు. దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడి తరఫున కృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు.

కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ యుద్ధం చేయబోతున్నారని తెలిసి అటు రుక్మిణి, ఇటు సుభద్రతోపాటు మరోవైపు నారదుడు కూడా ఇద్దరికీ సర్ది చెప్పాలని చూస్తారు. కానీ అర్జునుడు, కృష్ణుడు వారి మాటలను వినకుండా యుద్ధం చేసేందుకు పూనుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తుంటాడు. అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడు నాశనం చేస్తుంటాడు. ఇలాగైతే లాభం లేదనుకుని కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు.

 

అప్పుడు అర్జునుడు తనకు మహా శివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడిపైకి పంపుతాడు. దీంతో ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వెంటనే యుద్ధం జరిగే స్థలం వద్ద ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా.. కృష్ణుడు, అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటారు. అనంతరం బ్రహ్మ గయున్ని కృష్ణుడికి ఇచ్చేయమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయున్ని కృష్ణుని వద్దకు పంపుతాడు. అప్పుడు కృష్ణుడు గయున్ని చంపుతాడు. అనంతరం బ్రహ్మ మళ్లీ కమండలంలో ఉండే జలాన్ని చల్లి గయున్ని బతికిస్తాడు. దీంతో అటు కృష్ణుడు, ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి. అయితే నిజానికి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం నిత్య జీవితంలోకి కూడా అన్వయించుకోవచ్చు. ఎలాగంటే..

ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఏ మనిషి అయినా ముందుకు వెళతాడు. అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఎవరికైనా తాము ప్రేమించే లేదా తమకు దగ్గరైన వారికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా తమకు తోచిన రీతిలో ఏది కరెక్ట్‌ అనుకుంటే దాని వైపు ముందుకు వెళ్లాలి. అప్పుడు తమ కుటుంబ సభ్యులు అడ్డుగా వచ్చినా సరే.. తాము అనుకున్న అంశం వైపే నిలబడాలి. ఇదే విషయాన్ని శ్రీకృష్ణార్జుల యుద్ధం మనకు తెలుపుతుంది. ఇక కృష్ణుడు మహాభారత యుద్ధానికి సన్నాహకంగా కూడా అర్జునుడితో అలా యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM