ఆరోగ్యం

High BP : చిటికెడు చాలు.. జ‌న్మ‌లో బీపీ రాదు..!

High BP : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని భాదిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ ఒక‌టి. దీనిని సైలెంట్ కిల్ల‌ర్ గా చెబుతూ ఉంటారు. ఎటువంటి బాధ లేకుండా మ‌నిషి ప్రాణం పోవ‌డానికి దారి తీస్తుంది ఈ బీపీ. బీపీ కార‌ణంగా మూత్ర‌పిండాలు వైఫ‌ల్యం చెందుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. మెద‌డు ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ప‌క్ష‌వాతం రావ‌డానికి కూడా ప్రధాన కార‌ణం ఈ బీపీయే. అయితే చాలా మందిలో వారికి బీపీ ఉన్న‌ట్టుగానే తెలియ‌డం లేదు. ఎటువంటి ల‌క్ష‌ణాలు, స‌మ‌స్య‌లు తలెత్త‌క‌పోయే స‌రికి చాలా మంది వారికి బీపీ లేదు అని భావిస్తున్నారు. ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌మ‌య్యి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డిన త‌రువాత‌నే చాలా మంది బీపీకి సంబంధించిన ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డాని కంటే ముందుగానే మ‌నం త‌ర‌చూ బీపీ ప‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి.

ఒక్క‌సారి ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే. క‌నుక బీపీ ఉన్నది తెలియ‌గానే వెంట‌నే మందులు వాడ‌కుండా స‌హ‌జ సిద్దంగా కూడా ఈ బీపీని మ‌నం అదుపులోకి తెచ్చుకోవ‌చ్చు. మొద‌టి ద‌శ‌ ( 129 – 89) హైబీపీతో బాధ‌ప‌డే వారు మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్దంగా రెండు నెలల్లోనే బీపీ సాధార‌ణ స్థాయికి వ‌చ్చేలా చేయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మొద‌టి ద‌శ హైబీపీతో బాధ‌ప‌డే వారు యాల‌కుల పొడిని వాడ‌డం వ‌ల్ల స‌హ‌జంగా బీపీని తగ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. రోజూ ఉద‌యం 3 గ్రాములు, అలాగే సాయంత్రం 3 గ్రాముల యాల‌కుల పొడిని ఇచ్చి 20 మందిపై రెండు నెల‌ల పాటు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని వారు చెబుతున్నారు. అలాగే అధిక ర‌క్త‌పోటు అదుపులో లేని వారు కూడా ఈ యాల‌కుల పొడిని వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు. పూట‌కు మూడు గ్రాముల మోతాదులో రెండు పూట‌లా యాల‌కుల పొడిని వాడ‌డం వ‌ల్ల మందులు వాడే అవ‌స‌రం లేకుండా అధిక ర‌క్త‌పోటు చాలా సుల‌భంగా అదుపులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

High BP

అంతేకాకుండా ఈ యాల‌కుల పొడిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరంలో యాంటీ ఆక్సిండెంట్లు 90 శాతం వ‌రకు పెరిగాయ‌ని నిపుణులు ఈ ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. యాంటీ ఆక్సిడెంట్లు పెర‌గ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. శ‌రీరంలో రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. శ‌రీరంలోని మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. అయితే అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య చాలా భ‌యంక‌ర‌మైన‌దని బీపీ రీడింగ్ ఎల్ల‌ప్పుడూ 110-80 లోపు ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా యాల‌కుల పొడిని రెండు పూట‌లా వాడ‌డం వ‌ల్ల మొద‌టి ద‌శ‌లో బీపీ ఉన్న వారు మందులు వ‌డ‌కుండానే బీపీని త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే యాల‌కుల పొడిని వాడ‌డం వ‌ల్ల అదుపు త‌ప్పిన బీపీ క్ర‌మంగా అదుపులోకి వ‌స్తుంద‌ని, దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల బీపీ లేని వారికి బీపీ రాకుండా ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM