Lord Shiva : శివుని ఆజ్ఞ లేనిదు చీమైనా కుట్టదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి మహా శివుని అనుగ్రహం మనపై ఉండాలని అనేక రకాల పూజలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. జీవితంలో ఎదగాలని మనం ఎంత ప్రయత్నించినా ఆ శివుని ఆజ్ఞ లేనిదే మనం ఏది సాధించలేము. ఆ శివుని మెప్పు పొంది శివానుగ్రహం మనపై ఉండాలంటే శివున్ని కొన్ని ప్రత్యేకమైన వస్తువులు, పూలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. కష్టాలు, బాధలు, సమస్యలతో బాధపడే వారు శివునికి ఇష్టమైన పనులు చేయడం వల్ల చాలా సులభంగా శివుని అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివుని అనుగ్రహాన్ని పొందడానికి మనం చేయాల్సిన పనులు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా శివున్ని సోమవారం నాడు పూజించాలి. శివున్ని పూజించే ముందు శుభ్రంగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటున విభూతి ధారణ చేయాలి. శివున్ని సమయంలో 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే శివుని పూజించడానికిముందుగా వినాయకుడిని పూజించాలి. శివుడికి కుంకుమ పెట్టకూడదు. విభూతి, గంధం మాత్రమే పెట్టాలి. శివుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకాన్ని చేయించాలి. శివునికి మాత్రం తులసి ఆకులను అస్సలు సమర్పించకూడదు. అదే విధంగా సోమవారం రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. శివున్ని శంకు పుష్పాలు, తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి.
పారిజాత పుష్పాలతో పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. జిల్లేడు పువ్వులతో పూజించడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అదే విధంగా శివున్ని మల్లెపువ్వులతో పూజించడం వల్ల వివాహం జరుగుతుంది. అదే విధంగా శివుడు సంపగి పూలకు శాపం విధించనట్టుగా పురాణాలు చెబుతున్నాయి. కనుక సంపగి పూలతో శివున్ని పూజించకూడదు. అలాగే సకల శుభాలు కలగాంటే సోమవారం నాడు శివుడితో పాటు అమ్మవారికి కూడా పూజలు చేయాలి. అలాగే సోమవారం నాడు శివున్ని పూజించే వారు ధూమపానం, మద్యపానం చేయకూడదు. మాంసాహారాన్ని, ఉల్లిపాయలు తీసుకోకూడదు. అలాగే గ్రహ దోషాలతో బాధపడే వారు సోమవారం నిత్యం శివనామస్మరణలోనే ఉండాలి. ఈ విధంగా శివుడికి ఇష్టమైన పూలతో పూజించడం వల్ల మన సమస్యలన్నీ తొలగిపోతాయని సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…