Kalabhairava Swamy : కాల భైరవ స్వామి కటాక్షం ఉంటే కష్టాలన్ని కూడా సమతి పోతాయని పండితులు చెబుతున్నారు. కాలభైరవ స్వామి విశిష్టమైనటువంటి దేవతా మూర్తి అని, కాలభైరవున్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశిష్టమైన ఫలితాలు చేకూరుతాయని వేదం కూడా చెబుతుంది. కష్టాలు, బాధలు, ఇంట్లో సమస్యలతో బాధపడే వారు ఈ స్వామిని పూజించడం వల్ల కష్టాలన్నీ దూరమయ్యి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కాల భైరవ స్వామిని పూజించి తమ కష్టాలను దూరం చేసుకున్న భక్తులు వేలల్లో ఉన్నారని వారు తెలియజేస్తున్నారు. ఈ స్వామిని ఎలా పడితే అలా పూజించకుండా కూడదని ఈ స్వామిని పూజించడానికి ప్రత్యేక పూజ విధానం అంటూ ఉంటుందని అలాగే ఈ స్వామికి సమర్పించిన నైవేధ్యానికి కూడా విశిష్టత ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అయితే అసలు కాలభైరవ స్వామిని ఎలా పూజించాలి.. ఏ రోజున పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి.. అలాగే ఎవరు పూజించాలి.. వంటి వివిధ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాలభైరవ స్వామి రూపాన్ని మనం పరిశీలించినట్టయితే ఈ స్వామి వారు శునకం మీద నాలుగు భుజాలతో త్రిశూలం, కపాలి, అభయ ముద్ర, అగ్నిహోత్రాన్ని పట్టుకుని కూర్చుని ఉంటారు. అలాగే కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే మనం కాశీలో అడుగు పెట్టగలమని ఈ స్వామి అనుగ్రహం లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా కాశీలో అడుగు పెట్టలేమని పండితులు చెబుతున్నారు.
గ్రహ దోషాలన్నీ తొలగిపోవాలంటే మనం తప్పకుండా కాలభైరవ స్వామిని ఆరాధించాలని వారు తెలియజేస్తున్నారు. కాలభైరవ స్వామిని శనివారం నాడు ఉదయం 5 నుండి 6 గంటల సమయంలో కాలభైరవ స్వామి ఆలయంలో దీపారాధన చేయాలి. కాలభైరవ స్వామికి చేసే దీపారాదన ఎంతో ప్రత్యేకమైనది. దీని కోసం ముందుగా బూడిద గుమ్మడి కాయను సగం లోకి కట్ చేసి లోపల కొద్ది భాగాన్ని తొలగించాలి. తరువాత ఇందులో నువ్వుల నూనె పోసి అందులో తోక మిరియాలను వేయాలి. తరువాత ఎర్రటి వస్త్రంతో వత్తిని చేసి నూనెలో ఉంచాలి. ఈ బూడిద గుమ్మడికాయను రాళ్ల ఉప్పు పోసి దానిపై ఉంచాలి. తరువాత దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని కనుక స్వామి వారికి చూపిస్తే ఎటుదవంటి కష్టాలైనా తొలగిపోతాయని, ఎటువంటి సమస్యలైనా పరిష్కరించబడతాయని పండితులు చెబుతున్నారు.
25 నక్షత్రాల వారు, 12 రాశుల వారు ఎవరైనా ఈ దీపారాధన చేయవచ్చని వారు చెబుతున్నారు. అలాగే ఈ స్వామి వారికి అటుకులు, కొబ్బరి, పాలు, పంచదార లేదా బెల్లం వేసి పాయసం చేసి నైవేధ్యంగా పెట్టాలి. ఈ విధంగా కాలభైరవ స్వామికి దీపారాధన చేసి ఆరాధిస్తారో కష్టాలన్ని తొలగి భోగ భాగ్యాలు కలుగుతాయని , వ్యాపారంలో లాభాలు చేకూరుతాయని , వివాహ దోషాలు, గండ దోషాలు, కాలసర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…