Pratyangira Mantram : మనుషులు తమ జీవితంలో చేసే పనులకు గాను మిత్రులు ఏర్పడుతుంటారు, శత్రువులు తయారవుతుంటారు. మిత్రులు మన మంచి కోరితే శత్రులు మాత్రం మన అంతం కోరతారు. మనల్ని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు చూస్తుంటారు. శత్రువులు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ కొందరికి శత్రువులు ఏర్పడుతుంటారు. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. అయితే ఇలాంటి బాధలు ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను పఠిస్తూ పరిహారం చేస్తే చాలు.. దాంతో శత్రువులు మిమ్మల్ని చూడాలంటనే భయపడిపోతారు. శత్రువుల బాధ ఉండదు. వారి పీడ వదిలిపోతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శత్రువుల నుంచి రక్షణ పొందడానికి, శత్రు నిర్మూలనకు, శత్రు బాధలు తొలగిపోవడానికి కింది పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. మల్లె పువ్వులతో అమావాస్య రోజున కాళికా దేవిని పూజించాలి. దీంతో ఎలాంటి శత్రు బాధలు అయినా సరే పోతాయి. అలాగే శత్రువులు ఇబ్బందులకు గురి చేస్తుంటే.. నాలుగు జీడి గింజలను తీసుకుని భైరవ లేదా ప్రత్యంగిరా మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. అనంతరం ఊరి బయట తుమ్మ చెట్టు మొదట్లో వాటిని పాతి పెట్టాలి. అలా పాతి పెట్టే సమయంలో మీ శత్రువు పేరును 11 సార్లు ఉచ్చరించాలి. దీంతో వారి పీడ వదిలిపోతుంది.
ఒక తెల్లని పేపర్‌పై మీ శత్రువు పేరు, అతని తల్లి పేరును బొగ్గుతో రాసి ఊరి బయట శ్మశానంలో పాతి పెట్టాలి. దీంతో శత్రు బాధలు తొలగిపోతాయి. చేతిలో తెల్ల ఆవాలని తీసుకుని 11 సార్లు.. ఉగ్రం వీరం మహా విష్ణుం, జ్వలంతం సర్వతోముఖం, నృసింహం భీషణం భద్రం, మృత్యుర్ మృత్యుమ్ నమామ్యహం.. అన్న నృసింహ మంత్రంతో మంత్రించి మీ ఇంటి ఆవరణలో, నలు మూలల్లో, నాలుగు దిక్కుల్లో చల్లడం వల్ల మీ శత్రువు మిమ్మల్ని బాధించడు. శత్రువు పేరు, తల్లి పేరు భోజ పత్రంపై గంధంతో రాసి తేనె సీసాలో పెట్టి మూత బిగించి పూజ గదిలో పెట్టండి. శత్రువులు నిర్వీర్యులై మీకు హాని చేయకుండా ఉంటారు. శత్రువు పేట్రేగి పోతుంటే మీ ఇంటి బయట మంట పెట్టి ఎండు మిరపకాయలు ఐదు తీసుకుని మీపై నుంచి 5 సార్లు శత్రువు పేరు చెబుతూ తిప్పి ఇంటి బయట కాలుతున్న మంటలో వేయండి. శత్రు పీడ పోతుంది.
కొన్ని తెల్ల ఆవాలను తీసుకుని ఓం భ్రం భైరవాయ నమః అన్న భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది దిక్కులా చల్లండి. మీ శత్రువుల నుంచి భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు. శనివారం మిట్ట మధ్యాహ్నం తన ఎత్తుకు సరిపడా ఎత్తులో ఎర్ర దారాన్ని తీసుకుని కొబ్బరి బొండానికి ఆ దారాన్ని చుట్టి పసుపు కుంకుమతో బొండాన్ని అలంకరించి మూడు సార్లు దిష్టి తీసుకుని ప్రవహించే నదిలో వేయాలి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా ఈ తంత్రాన్ని ఏడు సార్లు చేయాలి. ఆర్థిక నష్టాలు, రుణ బాధలు పోతాయి. శత్రు పీడల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రువులు నశిస్తారు. రోగాలు తొలగిపోతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…