డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంతో కూడుకున్న పనో అందరికీ తెలిసిందే. ఉద్యోగం లేదా వ్యాపారం.. ఏదైనా సరే ఒక్క రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అయితే కొందరికి ఆదాయం బాగానే ఉంటుంది. కానీ కొందరు మాత్రం చాలీ చాలని ఆదాయంతో నెట్టుకొస్తుంటారు. బిజినెస్ లేదా ఉద్యోగం ఎందులో అయినా సరే కొందరు సంపాదించే డబ్బు వారికి ఖర్చులకు సరిపోదు. దీంతో సేవింగ్స్ చేయలేకపోతుంటారు. అయితే కింద తెలిపిన విధంగా పలు పనులు చేస్తే చాలు.. దాంతో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం పెరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
చాలా మంది తమ ఇంటి ఆవరణ లేదా బయట ఎక్కడైనా వేరే ప్రదేశాల్లో ఉండే చెట్లు లేదా మొక్కలను నాశనం చేస్తుంటారు. అలా చేయరాదు. పచ్చని చెట్లను లేదా మొక్కలను నరికినా, నాశనం చేసినా పాపం చుట్టుకుంటుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. దానికి బదులుగా మొక్కలను పెంచడం అలవాటు చేసుకోండి. మొక్కలు ఎంత పచ్చగా పెరిగితే అంత మంచిది. దీంతో డబ్బుకు లోటు ఉండదు. రెండు చేతులా సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు పోతాయి.
రాత్రి పూట ఒక రాగి చెంబులో ఒక మందార మొగ్గను వేయండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేశాక బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. అనంతరం మందార మొగ్గను తీసేసి ఆ నీళ్లను తాగండి. తరువాత బయటకు వెళ్లండి. ఇలా 41 రోజుల పాటు చేయండి. 42వ రోజు నుంచి మీ కష్టాలు తీరిపోవడాన్ని మీరు గమనిస్తారు. డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.
ప్రతి రోజూ పేదలకు ఆహారం పెట్టండి. లేదా మూగజీవాలకు ఆహారం, నీరు పెట్టవచ్చు. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అలాగే రోజూ ఉదయం వేకువ జామున స్నానం చేసి ఒక గంట పాటు కనకధారా స్తోత్రం చదవండి. ఇలా చదివేటప్పుడు పసుపు రంగు లేదా తెలుపు రంగు దుస్తులను ధరించండి. దీంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది. డబ్బు చేతిలో నిలుస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో కోట్లు సంపాదిస్తారు. ఈ విధమైన చిట్కాలను పాటించడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…