Snoring Home Remedies : మనలో చాలా మంది గురక సమస్యతో బాధపడుతూ ఉంటారు. గురక వల్ల వారితో పాటు వారి పక్కన పడుకునే వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. గురక కారణంగా ప్రశాంతమైన నిద్రను దూరం చేసుకుంటారు. గురక పెట్టడం వల్ల వారి పక్కన పడుకునే వారికి కొన్నిసార్లు నిద్ర పట్టడం కూడా కష్టంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఏర్పడడం వల్ల ఎక్కువగా గురక వస్తుంది. గురక వల్ల వారి జీవిత భాగస్వామికి ఇబ్బంది కలుగుతుందని బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మీతో పాటు మీ జీవిత భాగస్వామి కూడా ప్రశాంతంగా నిద్రించవచ్చు. గురక సమస్యతో ఎక్కువగా బాధపడే వారు ఇయర్ ప్లగ్ లను వాడడం మంచిది. గురక శబ్దాన్ని తగ్గించడంలో ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిని వాడడం వల్ల ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.
నిద్రకోసం రూపొందించబడిన మృదువైన, సౌకర్యవంతమైన ఇయర్ ప్లగ్ లను కొనుగోలు చేసి వాటిని ధరించి నిద్ర పోవడం వల్ల గురక శబ్దం తక్కువగా వస్తుంది. అలాగే గురక సమస్యతో బాధపడే వారు వైట్ నాయిస్ మెషీన్ లేదా యాప్ లను వాడడం మంచిది. ఇవి గురక శబ్దానికి బదులుగా మనం నిద్రపోవడానికి అనువుగా ఉండే ఇతర శబ్దాలను సృష్టించడంలో సహాయపడతాయి. మీకు ఏది బాగా పని చేస్తుందో తెలుసుకోవడానికి గానూ సముద్రపు అలలు, వర్షపాతం, పక్షుల అరుపులు ఇలా వివిధ శబ్దాలతో ప్రయోగాలు చేయడం మంచిది. అలాగే మీరు పడుకునే విధానాన్ని కూడా మార్చాలి. మీకు గురక ఎక్కువగా వస్తూ ఉంటే మీ జీవిత భాగస్వామి వైపు తిరిగి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల గురక తగ్గుతుంది. గాలి ప్రవాహాం కూడా మెరుగుపడుతుంది.
అలాగే తలకింద అదనంగా దిండ్లను ఉంచుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. అలాగే పడుకునే ముందు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రకు ముందు కెఫీన్, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. పడుకునే గది చల్లగా, చీకటిగా ఉండేలా చూసుకోవాలి. ఇది గురకను తగ్గించడంతో పాటు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి ప్రశాంతమైన నిద్రను అందించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గురక సమస్యతో బాధపడే వారు ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఇలా మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవడం వల్ల గురక సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…