Gold Rules : భారతీయులకు ఇష్టమైన వాటిలో బంగారం కూడా ఒకటి. పండుగలకు, పెళ్లిళ్లకు, ఇతర ముఖ్య సందర్భాలల్లో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే బంగారం అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలల్లో భారతదేశం కూడా ఒకటి. దేశంలోని దాదాపు ప్రతి కుటుంబంలో ఎంతో కొంత బంగారం ఉంటుందని చెప్పవచ్చు. నాణెలు, బిస్కెట్లు, ఆభరణాలు ఇలా ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబం ఎంతో కొంత బంగారాన్ని కలిగి ఉంటుంది. అలాగే బంగారం కొందరు పెట్టుబడిగా కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బంగారాన్ని మన దేశంలో అదృష్టంగా, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అయితే మన ఇంట్లో ఉంచుకునే బంగారానికి ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది.
ఇంట్లో ఉండే ఈ విలువైన లోహాన్ని నిల్వ చేయడానికి సంబంధించిన అన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్( సిబిడిటి) ప్రకారం వెల్లడైన ఆదాయ వనురులతో, వ్యవసాయ ఆదాయంతో, చట్టబద్దంగా సంక్రమించిన డబ్బు, ఇంటి పొదుపుతో కొనుగోలు చేసిన బంగారానికి పన్ను విధించబడదు. అలాగే అవివాహిత స్త్రీ 250 గ్రాములు, అవివాహితుడు 100గ్రాములు, వివాహిత స్త్రీ 500గ్రాములు, వివాహితుడు 100గ్రాముల బంగారాన్ని వారి వద్ద ఉంచుకోవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట మొత్తంలొ బంగారం మన దగ్గర ఉంటే ఆదాయపు పన్ను అధికారులు కూడా ఈ బంగారాన్ని మన దగ్గర నుండి తీసుకోలేరు. బంగారాన్ని భద్రత కల్పించడంతో పాటు ఈ లోహాన్ని ఇంట్లో నిల్వ ఉంచుకోవడానికి సంబంధించిన ప్రభుత్వ నియమాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా మంచిది.
పెళ్లి అయిన స్త్రీలు 500గ్రాముల బంగారాన్ని కలిగిఉండవచ్చు. పెళ్లి కాని స్త్రీలు తమ దగ్గర 250గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. అలాగే పురుషులు తమ వద్ద 100గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. ఇక కొనుగోలు చేసిన మూడేళ్ల లోపు బంగారాన్ని విక్రయిస్తే ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల వద్ద ప్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది. కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తర్వాత విక్రయించిన బంగారం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఆకర్షిస్తుంది. మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో పాటు 4 శాతం సెస్ తో 20 శాతం పన్ను విధించబడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…