ఆరోగ్యం

Segmented Sleep : రాత్రి పూట నిద్రలో ఎక్కువగా లేస్తున్నారా..? అయితే అది మంచిదేనట.. ఎందుకో తెలుసుకోండి..!

Segmented Sleep : శారీరక, మానసిక ఒత్తిడి, అలసట, అనారోగ్యం.. ఇలా కారణాలు ఏమున్నా నేడు అధిక శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే నిద్రలేమి లేదా వేరే ఇతర కారణాల వల్ల రాత్రి పూట నిద్ర నుంచి 2, 3 సార్లు లేచినా అది మన శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించదట. పైగా అది మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందట. ఈ విషయాన్ని పలువురు వైద్య పరిశోధకులు తాజాగా వెల్లడించారు. నిత్యం 8 గంటల నిద్ర ప్రతి ఒక్కరికి తప్పనిసరి కాదు. కొంత మంది కేవలం కొద్ది గంటలు మాత్రమే పడుకుని రోజంతా యాక్టివ్‌గా ఉంటే, మరికొందరికి ఎక్కువ నిద్ర కావల్సి వస్తుంది. అది వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది.

అయితే వైద్య పరిశోధకులు నిద్ర గురించి చేసిన పరిశోధనల ప్రకారం రాత్రి పూట పూర్తిస్థాయిలో నిద్ర పోవాల్సిన అవసరం లేదట. మధ్య మధ్యలో 2, 3 సార్లు లేచినా నిద్రలేమి సమస్యపై, ఆరోగ్యంపై అది ప్రభావం చూపదట. వైద్యులు చేసిన పరిశోధన ప్రకారం రాత్రిపూట నిద్రలో 2,3 సార్లు లేవడమే మంచిదట. ఒకప్పుడు మన పూర్వీకులు ఇలాగే నిద్రించే వారట. అలా నిద్రలో మెళకువ వచ్చి లేస్తే ఒక్కోసారి ఇంటికి సంబంధించిన ఏదైనా పనో లేదంటే ధ్యానమో చేసేవారట. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తొలి నాళ్లలో కూడా రాత్రి పూట నిద్రలో ఇలా 2,3 సార్లు లేచే వారట. అప్పట్లో ఇలాంటి నిద్ర వల్ల కలిగే లాభాలను పలువురు వైద్య నిపుణులు తమ పత్రాల్లో కూడా ప్రచురించారు. ఈ నిద్రను సెజ్‌మెంటెడ్ స్లీప్‌గా పిలుస్తున్నారు.

ఈ సెజ్‌మెంటెడ్ స్లీప్ వల్ల మెదడు పూర్తిగా హాయిని పొందుతుంది. ఒక నిద్రకు, మరో నిద్రకు మధ్య రిలాక్సేషన్‌ను కలిగించే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవడం వల్లే మెదడు ఇలా హాయిని పొందుతుంది. శరీరం కూడా ఎక్కువ సందర్భాల్లో సెజ్‌మెంటెడ్ స్లీప్‌ని కోరుకుంటుందట. నిద్రలేమితో బాధపడే వారు ఈ నిద్ర విధానాన్ని అనుసరిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చట. సెజ్‌మెంటెడ్ స్లీప్ నిద్రలేమి తనాన్ని దూరం చేస్తుందట. అయితే నిద్ర పోయేందుకు నిద్ర మాత్రలను ఎప్పటికీ వాడకూడదు. మన పూర్వీకులు సెజ్‌మెంటెడ్ స్లీప్‌ను ఎక్కువగా అనుసరించే వారట. దీంతో వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండే వారు. అప్పట్లో ఇప్పుడునన్ని సదుపాయాలు ఉండేవి కావుగా.

రాత్రి పూట ఎక్కువగా కరెంట్ కూడా ఉండేది కాదు. అయితే ఆ సమయంలో కరెంట్ సడెన్‌గా పోయినా మన పూర్వీకులు అందుకు తగ్గట్టుగా నిద్రించే వారట. ఇది కూడా వారిలో సెజ్‌మెంట్ స్లీప్ పాటించడానికి కారణమైంది. మనవారు సూర్యాస్తమయంతో నిద్రను ప్రారంభించి సూర్యోదయంతో నిద్రను ముగించేవారు. అయితే ఇందులో కూడా ఒక కారణం ఉంది. మన శరీరం కాంతికి, చీకటికి త్వరగా స్పందిస్తుంది. చీకటిగా ఉంటే మనకు నిద్ర ఎక్కువగా వస్తుంది. కాంతిలో తక్కువగా నిద్ర‌ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే మన పెద్దలు ముందు పేర్కొన్న విధానాన్ని పాటించే వారు. సో.. మనం కూడా మన పెద్దల్లాగే సెజ్‌మెంటెడ్ స్లీప్‌ను, వారి నిద్ర విధానాలను పాటిస్తే ఎంచక్కా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM