Red Guavas : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో జామకాయలు కూడా ఒకటి. జామకాయలు కాస్త పచ్చిగా, దోరగా ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటాయి. కానీ కొందరు పండ్లను మాత్రమే తింటారు. అయితే ఎలా తిన్నా సరే.. జామకాయల వల్ల మనకు లాభాలే కలుగుతాయి. అయితే జామకాయల్లో మనకు రెండు రకాల కాయలు లభిస్తాయి. లోపలి గుజ్జు తెల్లగా ఉండేవి ఒక రకం అయితే.. ఎర్రగా ఉండేవి ఒక రకం. ఈ ఎర్రగా ఉండే కాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జామకాయల్లో బీటా కెరోటీన్ మోతాదు ఎక్కువైతే అవి ఎర్రగా ఉంటాయి. అయితే ఈ బీటా కెరోటీన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కనుక ఎరుపు రంగులో ఉండే జామకాయలను తింటే కంటికి మేలు చేస్తుందన్నమాట. ఇక ఈ కాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. బరువును తగ్గిస్తుంది. చర్మాన్ని, జుట్టును సంరక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను రాకుండా చూస్తుంది.
ఎర్ర జామకాయలను తినడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటివి ఉండవు. ఈ కాయల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే చేతులు, కాళ్లలో వచ్చే తిమ్మిర్లు తగ్గుతాయి. పొటాషియం సమృద్దిగా ఉండడం వల్ల ఈ కాయలను తింటే రక్త ప్రవాహం బాగా జరిగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు. ఇక ఈ కాయలను తింటే అలసట, నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండడం వల్ల రక్తకణాల వృద్ధికి సహాయపడుతుంది. దీంతో రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
ఇలా ఎర్ర రంగు జామకాయలను తినడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈసారి ఈ కాయలు కనబడితే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని తినండి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…