Rajeev Kanakala : సుమ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె అంతలా బుల్లితెరను ఏలేస్తుంది. ఆమె మళయాళీ అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలా మనలో కలిసి పోయింది. ఒకవైపు బుల్లితెరపై షో లు చేస్తూనే మరోవైపు సినిమా ఫంక్షన్లు చేస్తూ చాలా బిజీగా ఉంది. అయితే ఆమె ఈ మధ్య ఎందుకో మాటలను మాట్లాడే ముందు ఆలోచించడం లేదని అనిపిస్తోంది. ఆమె మాటల వల్ల హీరోలు అయోమయంలో పడిపోవాల్సిన పరిస్థితి వస్తోంది.
మొన్నీ మధ్యే కల్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా జూనియర్ ఎన్‌టీఆర్‌ను తన 30వ సినిమా అప్‌డేట్ ఇవ్వమని సుమ అందరి ముందు వేదికపైనే అడిగేసింది. దీంతో ఎన్‌టీఆర్ అసహనంగా ఫీలవుతూ.. ఫ్యాన్స్ అడగకున్నా మీరే చెప్పించేలా ఉన్నారు.. అంటూ చురకలంటించారు. అలాగే మరో ఫంక్షన్‌లోనూ ఇలాగే మాట్లాడిన సుమ హీరోను ఇబ్బందికి గురి చేసింది. అయితే ఇవి పక్కన పెడితే ఆమె బెస్ట్ యాంకర్ అని చెప్పవచ్చు. ఇక సుమ గతంలో ఒకసారి తన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ తన భర్త రాజీవ్ కనకాలతో ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది.
రాజీవ్, సుమ 1999వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు వీరి ప్రేమ ప్రయాణం 1994వ సంవత్సరంలో మొదలైంది. మొదట రాజీవ్ ప్రపోజ్ చేశాడు, సుమ మొదట్లో రిజెక్ట్ చేసింది ఆ తర్వాత ఓకే చేసింది. అప్పుడు రాజీవ్ ఒక కండిషన్ పెట్టాడు. పెళ్ళి తరువాత సినిమాలు చేయడం మానేయలని అన్నాడు. దాంతో సుమ పెళ్లి చేసుకోను అని చెప్పి రాజీవ్‌తో సంవత్సరంన్నర పాటు మాట్లాడలేదు. ఆ సమయంలో రెండు మూడు సినిమాలు చేసింది. అయితే అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో సినిమా రంగం నచ్చలేదు. సినిమాలను వదిలేసింది. అప్పుడు రాజీవ్ తో మాట్లాడి తమ ప్రేమ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలతో మాట్లాడి 99 లో పెళ్లి చేసుకున్నారు. తనకు రాజీవే మొదటి విమర్శకుడనీ, ఏవైనా కార్యక్రమాల విషయంలో బాగుంటే చాలా మెచ్చుకుంటాడని చెప్పుకొచ్చింది. ఇక సుమ, రాజీవ్ విడిపోయారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లేనని వారు స్పష్టం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…