Ponnaganti Kura : అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర సంవత్సరం పొడవునా లభ్యం అవుతుంది. ఈ కూర పొలాల గట్ల వెంట ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకుకూరను పప్పుగా చేసుకోవచ్చు. అలాగే సలాడ్స్ లో కూడా వేసుకోవచ్చు. ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వారంలో మూడుసార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ కూర ప్రస్తుతం అన్ని ఆకుకూరల లాగానే విరివిగా లభ్యమవుతోంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని తినవచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. మనకు ప్రకృతిలో లభించే అన్ని ఆకుకూరలు మనకు ఏదో రకంగా ప్రయోజనాలను కలిగిస్తాయి. కాబట్టి మిస్ కాకుండా తినడానికి ప్రయత్నం చేయండి. కంటి చూపు పెరుగుదలకు కూడా చాలా బాగా సహాయపడుతుంది. మన అమ్మమ్మలు నానమ్మలు వారి కాలంలో ఎక్కువగా ఈ ఆకుకూరను తినేవారు.
ఈ ఆకును మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాస్తే మొటిమలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఈ ఆకుకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…