Intelligent : ఫలానా వస్తువు లేదా జీవి అంత బరువు ఉంటుందని, ఫలానా వ్యక్తి అంత పొడవు ఉంటాడని, ఫలానా ప్రదేశాల మధ్య దూరం అంత ఉంటుందని.. మనకు ఆయా అంశాల పరంగా కొన్ని ప్రమాణాలు ఉంటాయి. వాటితోనే మనం లెక్కిస్తాం. బరువును కేజీల్లో, పొడవును అడుగులు లేదా సెంటీమీటర్లలో, దూరాన్ని కిలోమీటర్లలో.. ఇలా ఆయా అంశానికి అనుగుణంగా మనం కొలతలు చెబుతాం. మరి ఓ వ్యక్తికి తెలివి ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా..? తెలివికి కొలమానం ఏమిటి..? అంటే.. మనకు గుర్తుకు వచ్చేది ఒక్కటే..! అదే ఐక్యూ.. ఇంటెల్లిజెంట్ కోషంట్ (intelligence quotient).
ఐక్యూని లెక్కిస్తేనే ఏ వ్యక్తికైనా తెలివి ఎంత ఉంటుంది అనేది అవగతమవుతుంది. ఐక్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత తెలివైన వారుగా వారు గుర్తింపబడతారు. అయితే మీకు తెలుసా..? ఐక్యూ లెక్కించినా, లెక్కించకపోయినా, కొందరు వ్యక్తులు మాత్రం ఆయా అంశాల పరంగా తెలివిమంతులేనట..! అవును, మీరు వింటోంది కరెక్టే..! మరి ఎలాంటి వారు తెలివిమంతులో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఎక్కువ భాషలు వస్తే..
ఒకటి కన్నా ఎక్కువ భాషల్లో ప్రవేశం ఉన్న వారు తెలివైన వారట. కనీసం 2, 3 భాషల్లోనైనా మాట్లాడగలిగి, అర్థం చేసుకోగలిగి, రాయగలిగి ఉన్నవారు మిక్కిలి తెలివిమంతులట. ఈ విషయాన్ని ఇటీవల పరిశోధనలు చేసిన సైంటిస్టులు తెలుసుకున్నారు. మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఏకంగా 16 భాషలు వచ్చు కదా. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంతటి ప్రజ్ఞాశాలో మనకు ఇట్టే అర్థమవుతుంది.
ఇంటికి పెద్దవారు..
ఇంట్లో పెద్ద సంతానంగా పుట్టిన వారు తెలివిమంతులట. అన్న, అక్క.. ఇలాంటి వారు తెలివి గలవారట. వారే ఇంటికి చెందిన మంచి చెడ్డలను చూడడంలో దిట్టలట. దీన్ని ఇటీవల చేసిన పరిశోధనలు వెల్లడించాయి కూడా.
డిగ్రీ చేసిన వారు..
టెన్త్, ఇంటర్ చదివిన వారితో పోలిస్తే డిగ్రీ చదివిన వారిలో చాలా మంది తెలివిమంతులు ఉంటారట. వారిలో దాదాపుగా 35 శాతం మంది తెలివిగల వారేనట.
ఎడమ చేతి వాటం..
కుడిచేతి వాటం కన్నా ఎడమ చేతి వాటం ఉన్నవారే ఎక్కువ తెలివిమంతులట. వారికే తెలివి ఎక్కువగా ఉంటుందట.
తెలియదని చెప్పే స్వభావం..
కొందరు తమకు ఏమీ తెలియక పోయినా అంతా తెలుసని భావిస్తారు. అయితే అలాంటి వారి కన్నా తమకు అంతా తెలిసినా, ఏమీ తెలియదని చెప్పే వారే తెలివిమంతులట.
దిగులు పడేవారు..
దిగులు చెందుతూ ఉండే వారే అధిక శాతం వరకు తెలివిమంతులు అయి ఉంటారట. పలువురు పరిశోధకులు చేసిన పరిశోధనలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.
పెంపుడు జంతువులపై ఇష్టం..
కుక్కలు, పిల్లుల వంటి జంతువులను పెంచుకునే వారి ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయట. వారే తెలివిమంతులుగా ఉంటారట.
బద్దకస్తులు..
ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు చేసిన పరిశోధనలో తేలిన నిజం ఏమిటంటే.. యాక్టివ్‌గా ఉండేవారి కన్నా బద్దకస్తులే ఎక్కువ తెలివిమంతులై ఉంటారట.
సరాదాగా ఉండేవారు..
ఇతరులతో చనువుగా, సరదాగా ఉండే వారు కూడా తెలివిమంతులేనట. వారిలో కూడా ఐక్యూ లెవల్స్ ఎక్కువగానే ఉంటాయట.
మద్యపానం..
మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది తెలివిమంతులే అయి ఉంటారట. సైంటిస్టులు చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అలాంటి వారిలో ఐక్యూ కూడా ఎక్కువగానే ఉంటుందట.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…