Nail Polish Effects : చాలామంది ఆడవాళ్లు, గోళ్ళకి నెయిల్ పాలిష్ ను వేసుకుంటూ ఉంటారు. రంగురంగుల నెయిల్ పాలిష్ లని కొనుగోలు చేసి, గోళ్ళకి వేసుకుంటూ ఉంటారు. అయితే, నిజానికి నెయిల్ పాలిష్ ని వేసుకోవడం వలన కలిగే దుష్ఫలితాల గురించి, చాలామందికి తెలియదు. నెయిల్ పాలిష్ ని వేసుకోవడం వలన, ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చాలామంది అమ్మాయిలకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం ఉంటుంది.
అందుకని, చాలా డబ్బులు పోసి మరీ, నెయిల్ పాలిష్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఏదో ఒక నెయిల్ పాలిష్ గోళ్ళకి ఉంటుంది. అయితే, నెయిల్ పాలిష్ వలన కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడో ఒకసారి గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన, ఎలాంటి హాని కూడా కలగదు. ఎప్పుడూ ఖాళీ లేకుండా అదే పనిగా గోళ్ళ మీద రంగు వేయడం వలన, గోళ్ళకి గాలి తగలదు. దీంతో సన్నగా, పెళుసుగా మారతాయి. విరిగిపోతాయి కూడా.
బలహీనంగా ఉన్న గోళ్ళకి తేలికగా బ్యాక్టీరియా వంటివి సోకుతాయి. బాగా ముదురురంగు నెయిల్ పాలిష్లని ఎక్కువ కాలం వేసుకోవడం వలన, గోళ్లు వాటి సహజ రంగుని కోల్పోతాయి. కొంచెం పసుపు రంగులోకి గోళ్లు మారిపోతాయి. అనారోగ్యకారంగా మారిపోతాయి గోళ్ళు. కాబట్టి, ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకుని పాటించండి. గోళ్ళరంగుల్లో ఎక్కువ కెమికల్స్ వేస్తూ ఉంటారు. ప్రమాదకరమైన విష రసాయనాలు ఉంటాయి.
మనం భోజనం చేసేటప్పుడు, ఇవి లోపలికి వెళ్తే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలానే, గోళ్లు రంగుని తీసేయడానికి నెయిల్ రిమూవర్ ని వాడుతూ ఉంటారు. నెయిల్ రిమూవర్ కారణంగా, గోళ్లు పెళుసు గా మారిపోతాయి. వానా కాలంలో, శీతాకాలంలో గోళ్ళ రంగు వేసుకోవడం అసలు మంచిది కాదు. గోళ్ళకి గాలి తగిలేటట్టు వదిలేయడమే మంచిది. ఎప్పుడైనా నెయిల్ పాలిష్లని, రిమూవర్లని వాడేటప్పుడు నాణ్యమైనవి మాత్రమే వాడండి. కొంతలో కొంత మంచిది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…