Omg 2 OTT Release Date : అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన, ఓ మై గాడ్ టు సినిమా ఓటిటిలో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. అక్టోబర్ 8న నెట్ ఫ్లిక్స్ లో, అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 సినిమా స్క్రీనింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని, మంగళవారం నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అనేక అడ్డంకులు, వివాదాల్ని ఎదుర్కొంటూ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
ఇదిలా ఉంటే, ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు కూడా నిరాకరించింది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో కనిపించారు. వివాదాలు రేకెత్తకూడదని సీబీఎఫ్సి సూచించడంతో, సినిమాలో ఆయన పేరుని మెసెంజర్ ఆఫ్ గాడ్ గా మార్చారు. సెన్సార్ రివిజన్ కమిటీ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా అప్పట్లో మారింది.
25 కి పైగా సీన్స్ ని సెన్సార్ బోర్డు మార్పులు చేసిందట. ఓ మై గాడ్ టు లో శివుడు పాత్రలో అక్షయ్ కుమార్ కనపడటంపై, కొన్ని వర్గాల వాళ్ళు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. సినిమాని నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ, ఆఖరికి మూవీ ఆగస్టు 11న థియేటర్లలో రిలీజ్ అయ్యి బాగా వసూళ్లను రాబట్టింది.
అక్షయ్ కుమార్ తో పాటుగా ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. అమిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 2012లో రూపొందిన ఓ మై గాడ్ కి సీక్వెల్ గా ఈ సినిమాని తెర మీదకి తీసుకువచ్చారు. ఓ మై గాడ్ 2 సినిమాకి ముందు అక్షయ్ కుమార్ నటించిన బచ్చన్ పాండే, సామ్రాట్, పృథ్వీరాజ్, రామసేతుతో పాటుగా 8 సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…