Mint Leaves : మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో పుదీనా కూడా ఒకటి. దీని వాసన చాలా బాగుంటుంది. అందుకనే పుదీనాను చాలా మంది పలు కూరల్లో వేస్తుంటారు. కొందరు పుదీనాతో ఏకంగా చట్నీలను చేసుకుని తింటుంటారు. పుదీనా నిజానికి మన శరీరానికి చల్లదనాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఇందులో ఉంటాయి. కనుక వేసవిలో పుదీనాను కచ్చితంగా వాడాలి. దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనాను వేసవిలో మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. లేదా నేరుగా పుదీనా రసం తీసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే పుదీనాను సలాడ్స్ లో వేసుకుని తినవచ్చు. లేదా పుదీనా టీ తాగవచ్చు. ఎలా తీసుకున్నా పుదీనాతో మనకు లాభమే కలుగుతుంది.
1. పుదీనాను తీసుకోవడం వల్ల ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఎండలో బాగా తిరిగేవారు ఇంటికి చేరుకోగానే పుదీనా మజ్జిగ తాగితే శరీరం వెంటనే చల్లబడుతుంది.
2. వేసవిలో మాంసాహారం తింటే కొందరికి పడదు. అందుకని వారు పుదీనాను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం వేడి చేయకుండా ఉంటుంది.
3. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పుదీనాను తీసుకుంటే ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. దగ్గు, జలుబు, నోటి దుర్వాసన సమస్యలు ఉన్నవారు పుదీనాను తింటే ఫలితం ఉంటుంది.
5. పుదీనాను రోజూ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…