Lemon Leaves : మనం నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ నిమ్మ ఆకుల గురించి పెద్దగా పట్టించుకోము. నిమ్మ ఆకులలోనూ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు పెద్దగా తెలియదు. ఆయుర్వేదంలో నిమ్మ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మ ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు సహాయపడతాయి. నిమ్మ ఆకులు చేదుగా ఉంటాయని తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. నిమ్మ ఆకులను తినడం లేదా వాటి రసాన్ని తీసుకోవడం లేదా వాటి వాసన చూడడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే నిమ్మ ఆకులను టీ లేదా జ్యూస్ వంటి వాటిలో వేసి తీసుకోవాలి.
నిమ్మ ఆకులలో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే వీటిల్లో ఆల్కలాయిడ్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీనితోపాటు కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు వంటి పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల రోగాల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి నిమ్మ ఆకులు మేలు చేస్తాయి. నిజానికి నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. శరీర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. మైగ్రేన్, మానసిక వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి నిమ్మ ఆకుల వాసన చూస్తే తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి నిమ్మ ఆకులు సహాయపడతాయి. నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆల్కలాయిడ్స్ మంచి నిద్రకు సహాయపడతాయి.
బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి నిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి. నిమ్మ ఆకుల నుండి తయారైన జ్యూస్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. నిమ్మ ఆకుల్లో క్రిమిసంహారక గుణాలు ఉండడం వలన కడుపులోని నులిపురుగులను నివారిస్తాయి. నిమ్మ ఆకు రసంలో తేనె కలిపి తీసుకోవాలి. దీంతో ఎంతో మేలు జరుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…