Eyes Itching : ఒకప్పుడంటే రోజంతా బయట కష్టపడి పనిచేసేవారు. కానీ ఇప్పుడలా కాదుగా, నిత్యం ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు.. వీటిపైనే పని. దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు. కొందరికి దృష్టి కూడా సరిగ్గా ఆనకపోతుండడం వల్ల అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇంకా కొందరు రోజంతా కళ్లు పొడిబారడం, మంటలు, దురదలు, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చటి నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ల మీద 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత ఆ వస్త్రంతోనే కళ్లపైనా మెత్తగా ఒత్తాలి. అలాగే కళ్ల లోపలా జాగ్రత్తగా ఆ వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా చేస్తే కళ్లల్లో పడిన దుమ్ము, ధూళి పోతుంది. కళ్లల్లో తిరిగి కన్నీళ్ల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కళ్లు పొడిబారడం తగ్గి దురదలు తగ్గిపోతాయి. దూదిని కొబ్బరి నూనెలో ముంచి కళ్లు మూసి కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. అయితే అలా రిలీఫ్ వచ్చేంత వరకు దూదిని ఎన్ని సార్లయినా అలా చేయవచ్చు.
అలోవెరా (కలబంద) ఆకుని బాగా కడిగి దానిని కట్ చేసి మధ్యలోంచి అలోవెరా జెల్ ని బయటికి తీయాలి. ఆ జెల్ ని కనురెప్పలపై రాసుకుని కళ్లు మూసుకుని 10 నిమిషాల పాటు ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజుకి ఇలా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలోవెరా జెల్ లో తేమ లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఎక్కువ. దీంతో కళ్లు పొడి బారకుండా ఉంటాయి. దురదలు, మంటలు తగ్గుతాయి. రోజ్ వాటర్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ సరిగా అందకపోయినా కూడా కళ్లు పొడిబారతాయి. దూదిని రోజ్ వాటర్ లో ముంచి కళ్లు మూసుకుని కనురెప్పలపై ఆ దూదిని ఉంచాలి. 10 నిమిషాల పాటు అలా వదిలేశాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో కళ్ల దురదలు, మంటలు తగ్గుతాయి.
తినే ఆహారంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండేలా చూడాలి. అంటే చేపలు, అవిసె గింజెలు, వాల్ నట్స్ వంటి ఆహార పదార్థాలను తింటే తద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. దీంతో కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…