ఆరోగ్యం

Kidney Stones : మీ కిడ్నీల‌లో రాళ్లు ఉన్నాయో లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా తెల్సుకోండి..

Kidney Stones : కిడ్నీ స్టోన్స్.. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగా మారింది. మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం. మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం, మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు. కిడ్నీ స్టోన్స్ వల్ల శరీరం సూచించే హెచ్చరికలను కొంత మంది పెడచెవి పెట్టి తమ ఆరోగ్యాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా. అయితే కింద ఇచ్చిన సందర్భాల్లో కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవేమిటో చూద్దాం.

కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే వారి కంటే తక్కువగా తినే వారికే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా కాల్షియం అడ్డుకుంటుంది. ఇందుకోసం అది వివిధ రకాల రసాయనాలతో మిళితమై పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ తొలి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.

Kidney Stones

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి మూత్రం రంగు కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల దాంతో ఉండే మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది. ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది. మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి సదరు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి. ఇది ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఉంటుంది. అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది. మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.

కిడ్నీస్టోన్స్ ఉంటే ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా వస్తుంది. అయితే ఇది ఎరుపు రంగులోనే కాక ఎరుపు, పసుపు మిక్స్ చేసిన డార్క్ రంగులోనూ కనిపిస్తుంది. కుటుంబంలో, వారి రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో డయేరియా ఉన్నవారు కూడా ఉంటే అది డీహైడ్రేషన్‌కు దారి తీసి కిడ్నీ స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది.

మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గనక జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు అనుగుణంగా పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభించాలి. విరేచనకారులు (లాక్సేటివ్స్)ను ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీస్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ లాక్సేటివ్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలగజేస్తాయి. తద్వారా శరీరం పోషకాలను తక్కువగా గ్రహిస్తుంది. డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది. ఇది కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు కారణమవుతుంది.

Share
IDL Desk

Recent Posts

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM

Viral Video : ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని రైలు ప‌ట్టాల‌పై నిద్ర పోయిన యువ‌తి.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ఇటీవ‌లి కాలంలో యువ‌త చిన్న చిన్న కార‌ణాల‌కి ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. కాస్త మ‌నస్థాపం చెంద‌డంతో ఆత్మ‌హ‌త్యే…

Saturday, 14 September 2024, 5:08 PM