ఆరోగ్యం

Metabolism : ఈ 10 చిట్కాల‌ను పాటిస్తే.. అధిక బ‌రువు త‌గ్గ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు..!

Metabolism : కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది..? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు..? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ ఈ ప్రక్రియ నెమ్మదిస్తే మాత్రం అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. బరువు పెరగడం వీటిలో ప్రధానమైంది. అయితే కింద పేర్కొన్న పలు సూచనలను పాటిస్తే శరీర మెటబాలిజాన్ని పెంచుకుని తద్వారా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దీంతో బ‌రువు కూడా త‌గ్గుతారు.

రోజుకి కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించడానికి తోడ్పడుతుంది. భోజనానికి ముందు చల్లని నీరు తాగితే జీర్ణాశయం కుచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే కఫం సమస్య ఉన్నవారు చల్లని నీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఒకేసారి ఎక్కువ భోజనం తినే కంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం ఉత్తమం. రోజుకి కనీసం 4 నుంచి 6 సార్లు భోజనం చేస్తే మంచిది. ముఖ్యంగా భోజనం అస్సలు మానేయకూడదు. వేళకు ఎంతో కొంత ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తినకపోతే జీవక్రియల వేగం తగ్గుతుంది. ప్రధానంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మానేయకూడదు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. రోజుకి కనీసం 2 నుంచి 3 కిలోమీటర్లు వాకింగ్ చేసినా సరిపోతుంది. ప్రధానంగా సాయంత్రం పూట చేసే వాకింగ్‌తో మెటబాలిజం ఎంతగానో మెరుగుపడుతుంది. రాత్రయ్యే కొద్దీ తగ్గే జీవక్రియల వేగం వాకింగ్ కారణంగా పెరుగుతుంది. నిత్యం 25 గ్రాముల చొప్పున 3 సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. రోజుకి 70 గ్రాములకి మించకుండా ప్రోటీన్లను తీసుకోవాలి. ఇవి రక్తంలోని ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి. రోజుకి 6 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతకు ఎక్కువైనా, తక్కువైనా మంచిది కాదు. జీవక్రియలు సరిగ్గా పనిచేయాలంటే తగినంత మోతాదులో నిద్ర అవసరమే.

ఉపవాసాలు అస్సలు చేయకూడదు. శరీరానికి వేళకు ఆహారం అందకపోతే మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతోపాటు శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. నిత్యం 150 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ మోతాదులో 2 నుంచి 3 కప్పుల వరకు గ్రీన్ టీ తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తాగరాదు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేసిన తరువాత కొంత సమయానికి గ్రీన్ టీ సేవిస్తే మెటబాలిజం ప్రక్రియ అద్భుతంగా వేగం పుంజుకుంటుంది. కోడిగుడ్డులో ఉండే తెల్ల‌సొన తింటున్నా శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి కొవ్వు ద‌రిచేర‌దు. పైగా అందులో ఉండే ప్రోటీన్లు, విట‌మిన్లు, ఇత‌ర పౌష్టికాహారం శ‌రీరానికి అందుతాయి.

Metabolism

నిమ్మ‌కాయ కూడా శ‌రీర మెట‌బాలిజంను పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు, ఇది శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది. ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో వాటిలో ఉండే ఫైబ‌ర్ ఇత‌ర పోష‌కాలు శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. అల్లం, బాదంప‌ప్పు, బ్ర‌కోలి, పాల‌కూర‌, వెల్లుల్లి, యాపిల్ త‌దితర ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తింటుంటే త‌ద్వారా శ‌రీర మెటబాలిజం పెరిగి చ‌క్క‌ని ఆరోగ్యం పొందుతారు. దీంతో అధికంగా ఉన్న బ‌రువు కూడా త‌గ్గుతారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM