ఒకప్పుడు వయస్సు 60 ఏళ్లు దాటిన తరువాతే జుట్టు తెల్లబడేది. వెంట్రుకలు తెల్లగా మారిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం 20 లలో ఉన్నవారి జుట్టు కూడా తెల్లగా మారుతోంది. జుట్టు తెల్లగా ఉంటే నలుగురిలో కలిసేందుకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా జుట్టు తెల్లగా ఉండేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే వాస్తవానికి జుట్టు తెల్లగా ఉందంటే.. అక్కడ నలుపు రంగును ఇచ్చే సమ్మేళనాలు లేనట్లే. ఇవి లేకపోతే జుట్టు తెల్లగా మారుతుంది. మన జుట్టుకు మెలనిన్ అనే సమ్మేళనం నలుపు రంగును ఇస్తుంది. ఇది సరిపోయినంతగా ఉంటే జుట్టు నల్లగానే ఉంటుంది. లోపిస్తే మాత్రం జుట్టు తెల్లగా మారుతుంది. అందుకనే కొందరిలో జుట్టు తెల్లగా ఉంటుంది. అయితే ఈ మెలనిన్‌ను మనం పెంచుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
మన చుట్టూ పరిసరాల్లో కానుగ చెట్టు ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. ఇది చిన్న మొక్కగా ఉండి పెద్ద వృక్షం వరకు పెరుగుతుంది. అయితే ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. వాటిల్లో గింజలు ఉంటాయి. వాటి నుంచి నూనె తీస్తారు. దీన్నే కానుగ నూనె అంటారు. ఇది మనకు బయట మార్కెట్‌లో ఎక్కడైనా సరే లభిస్తుంది. దీన్ని తెచ్చుకుని ఒక పాత్రలో పోసి మరిగించాలి. ఈ నూనె నల్లగా అయ్యే వరకు మరిగించాలి. దీంతో అందులోకి కొన్ని సమ్మేళనాలు విడుదలవుతాయి. అప్పుడు ఈ నూనెను 3 చుక్కలు తీసుకుని అందులో తగినంత కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా రాయాలి.
జుట్టుకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాక 1 గంట లేదా సమయం ఉంటే 2 గంటల పాటు వేచి ఉండాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేయాలి. దీని వల్ల జుట్టు వద్ద మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది జుట్టును నల్లగా మారుస్తుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు మొత్తం తగ్గిపోతాయి. ముఖ్యంగా జుట్టులో ఉండే ఫంగస్ తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు పోతాయి. చుండ్రు ఉండదు. అలాగే జుట్టు కూడా పెరుగుతుంది. ఇలా కానుగ నూనె జుట్టు సమస్యలను తగ్గించడంతోపాటు తెల్ల జుట్టును నల్లగా కూడా మారుస్తుంది. కనుక దీన్ని తరచూ వాడాలి. దీంతో మంచి ఫలితాలు వస్తాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…