తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఈ.సత్తి బాబు దర్శకత్వం వహించిన “నేను” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “అర్చన వేద శాస్త్రి” . శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, ఖలేజా వంటి సినిమాలతో పాటు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఈమె అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది. తాజాగా అర్చన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అమ్మాయిలని ట్రాప్ చేయాలని కొంతమంది హీరోలు ఉంటారని. మైండ్ ని క్యాప్చర్ చేయడానికి చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఎవరైన అమ్మాయి కాస్త వీక్ గా ఉంటే.. ఆ అమ్మాయి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది జనాలు ఉంటారని ఆమె అన్నారు. అందుకే అమ్మాయిలు వీక్ కాకూడదు. ఏడిస్తే వీక్ అనడం కరెక్ట్ కాదు. ఏడుపుకి, వీక్ కి సంబంధం లేదని అన్నారు. తనను కూడా వీక్ అనుకుని ఒక హీరో ట్రాప్ చేయాలని చూశాడని అతను మనకి బాగా తెలిసిన వ్యక్తే. మరీ ఎక్కువ సక్సెస్ కలిగిన హీరో కాదు. ఆయన నాకు తెలియకుండా నా వెనకాల నీచమైన మాటలు కూడా మాట్లాడాడట.అతని మాటలకు వేరే వాళ్లు అయితే చాలా బాధపడేవారు. అయితే అందంగా ఉండి బ్యాక్ గ్రౌండ్ పెద్దగా లేని అమ్మాయిలని వారి మైండ్ ని క్యాప్చర్ చేయడానికి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని కామెంట్స్ చేశారు.
మనకు మంచిది అనేది ముందే తెలుస్తుంది. మనకి సెట్ కాని పరిస్థితుల్లో కొందరు వీక్ అవుతారు. అలాంటి వారికి చేదు అనుభవాలు ఎదురవుతాయని..అలాంటివి ఏ అమ్మాయికైనా, అబ్బాయికైనా జరగకూడదని అర్చన అన్నారు. తనకి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని.. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోగలిగానని ఆమె అన్నారు. రాధాగోపాలం సినిమాలో అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చిన ఈ భామ అందులో నటించి ఉంటే కెరీర్ మరోలా ఉండేదని చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర తనను ఎంతగానో మెస్మరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చింది అర్చన.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…