Immunity Juice : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకు మంచి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. వానా కాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతుంటాయి. అలా కాకుండా వాటి నుండి దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ముఖ్యం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దృష్టి పెట్టాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాధితో లేదా ఇన్ఫెక్షన్లతో పోరాడగలరు. వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తి ఎంతో అవసరం. లేదంటే మన శరీరం తట్టుకోలేదు.
జలుబు, దగ్గు, జ్వరం మొదలైన వాటి వలన ఏ సమస్య లేకుండా ఉండాలంటే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. వానా కాలంలో వీటిని తీసుకుంటే, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ బాగా సహాయపడుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తో పోరాటానికి యాంటీ ఆక్సిడెంట్లు సాయం చేస్తాయి. అలానే క్యారెట్ ని తీసుకుంటే కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
అలానే, ఆపిల్స్ ని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆపిల్స్ వలన కూడా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. అయితే, వానాకాలంలో మీరు విడివిడిగా కాకుండా వీటన్నిటినీ కలిపి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవచ్చు. క్యారెట్, ఆపిల్, నారింజ, నిమ్మకాయ, పసుపు, మిరియాలతో ఈజీగా ఈ జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు.
క్యారెట్, ఆపిల్ ని ముక్కలు కింద కోసుకోవాలి. అందులో నారింజ రసం, నిమ్మరసం కలపాలి. నల్ల మిరియాలు, కొంచెం పసుపు వేసి జ్యూస్ కింద చేసుకుని తీసుకోవాలి. ఇలా చేస్తే, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. టాక్సిన్స్ ని బయటికి పంపుతుంది. ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. వానా కాలంలో సమస్యలు ఉండవు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…