ఆరోగ్యం

Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయిన‌ట్లే..!

Kidneys : మన శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో పని కోసం నిర్దేశించబడింది. శరీరానికి ఆక్సిజన్‌ను అందించే ఊపిరితిత్తులు, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణాశయం.. ఇలా ఒక్కో పని కోసం ఒక్కో అవయవం నిరంతరం విధులు నిర్వర్తిస్తూనే ఉంటుంది. అయితే కేవలం ఇవే కాకుండా శరీరంలో ఎప్పటికప్పుడే ఏర్పడే వ్యర్థాలను బయటికి పంపించే మూత్రపిండాలు కూడా మనకు అత్యంత ఆవశ్యకమే. అయితే నేటి తరుణంలో అధిక శాతం మంది కిడ్నీ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. వీటికి కారణాలు అనేకం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కిడ్నీ వ్యాధులు వచ్చాక బాధపడడం కంటే అవి రాకముందే శరీరం సూచించే కొన్ని రకాల అనారోగ్య లక్షణాలను ముందుగానే పసిగడితే ఆ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఎల్లప్పుడూ వికారంగా ఉంటుంటే మీ కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉందని గుర్తించాలి. దీర్ఘకాలం పాటు ఉండే వికారం కూడా కిడ్నీ సంబంధ వ్యాధులను సూచిస్తుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా రక్తం స్థాయిలు కూడా తగ్గిపోతాయి. దీంతో నీరసంగా, నిస్సత్తువగా, అలసటగా అనిపిస్తుంది. ఒక్కో సందర్భంలో శ్వాస ఆడడం కూడా కష్టంగా మారుతుంది. ఇది రక్తహీనతకు కూడా దారి తీస్తుంది. మూత్రం పోయడం కష్టతరమవుతుంటే కిడ్నీ సమస్య ఉందని భావించాలి. ఇందుకు తగిన విధంగా వైద్యుల వద్దకు వెళ్లి వారి సూచనలను పాటించాలి. కాళ్లు, మడమలు, పాదాలు, ముఖం, చేతులు వాపుగా అనిపిస్తున్నాయా..? అయితే ఇది కిడ్నీ సమస్య కావచ్చు.

Kidneys

ఎందుకంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉన్న వ్యర్థ ద్రవాలు అంత త్వరగా బయటికి వెళ్లవు. దీంతో అవి శరీరంలో పేరుకుపోయి ఆయా భాగాల్లో వాపులు కనిపిస్తాయి. రక్తంలో ఉన్న వ్యర్థపదార్థాలను వడపోసి కిడ్నీలు వాటిని బయటికి పంపుతాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ సమస్య వస్తే రక్తంలోని వ్యర్థాలు బయటికి వెళ్లక అలాగే ఉండిపోతాయి. ఈ సందర్భంలో చర్మంపై దురదలు వస్తాయి. కిడ్నీ సమస్య ఉంటే సాధారణం కంటే ఎక్కువగా మూత్రానికి వెళ్తారు. అలా వెళ్లినప్పుడు ఒక్కోసారి పెద్ద మొత్తంలో కూడా మూత్రం వస్తుంటుంది. ఇది తెలుపు రంగులో పాలిపోయినట్టుగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా రాత్రి పూట గమనించవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి తరచూ వెన్ను నొప్పి వస్తుంటుంది. ఇది నడుము పైభాగంలో వస్తుంది. కొంత మందికి జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి.

బీపీ ఎక్కువగా ఉన్నా కిడ్నీ సమస్య ఉందని తెలుసుకోవాలి. ఎందుకంటే బీపీ అనేది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలియజేస్తుంది. కాబట్టి బీపీ పెరిగితే దాన్ని కిడ్నీ సమస్యగా భావించాలి. కిడ్నీలు ఫెయిలైతే నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే రక్తంలోని యూరియా లెవల్స్ పెరిగిపోయి అలా జరుగుతుంది. పైన పేర్కొన్న లక్షణాలు గనక మీకు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోండి. ప్రధానంగా నీరు ఎక్కువగా తాగాలి. రోజుకి కనీసం 4 నుంచి 6 గ్లాసుల నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతోపాటు వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ఎందుకంటే దాంట్లోని సోడియం బీపీని పెంచుతుంది. తద్వారా కిడ్నీ సమస్యలు వస్తాయి.

ఒకవేళ మీకు డయాబెటిస్ లేదా హైబీపీ ఉన్నట్టయితే మీకు కిడ్నీ సమస్యలు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో వైద్య పరీక్షలు చేయించుకోండి. సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. వేళకు తగిన పోషకాలతో కూడిన ఆహారం మితంగా తీసుకోవాలి. జంక్‌ఫుడ్ తగ్గించాలి. మద్యపానం, ధూమపానం మానేయాలి. మద్యపానం వల్ల హైబీపీ వచ్చి అది కిడ్నీ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇక ధూమపానం విషయానికి వస్తే పొగ రక్తనాళాలను నాశనం చేస్తుంది. ఇది కిడ్నీలకు సరఫరా అయ్యే రక్తంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ రెండింటినీ మానేయాలి.

మూత్రం పోకుండా ఎక్కువ సేపు అలాగే ఉంటే మూత్రాశయం సాధారణం కన్నా ఎక్కువ సైజుకు పెరుగుతుంది. ఈ సమయంలో మూత్రానికి వెళ్తే మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవదు. ఇది కిడ్నీ ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది. ఇంగ్లిష్ మందులను ఎలా పడితే అలా ఎక్కువ రోజులు వాడకూడదు. దీని వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. వైద్యుల సలహా మేరకే మందులను వాడాలి. అధిక బరువు ఉన్నా కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని సందర్భాల్లో కిడ్నీస్టోన్స్‌కు దారి తీయవచ్చు. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. నిత్యం కొంత సమయం పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఎలాంటి శారీరక శ్రమలేకపోతే హైబీపీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Share
IDL Desk

Recent Posts

Sitting In Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కాసేపు అందులో కూర్చోవాలి.. ఎందుకంటే..?

Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు…

Friday, 17 May 2024, 3:11 PM

Work From Home Scam : వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ స్కామ్‌.. 4 రోజుల్లో రూ.54 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌..

Work From Home Scam : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుత త‌రుణంలో ఎంత‌గా ఉందో అంద‌రికీ తెలిసిందే. అయితే…

Friday, 17 May 2024, 11:30 AM

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

Temples For Moksham : ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న‌కు ద‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం…

Thursday, 16 May 2024, 8:29 PM

Chintha Chiguru Pulihora : చింత చిగురు పులిహోర త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Chintha Chiguru Pulihora : పులిహోర‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌పండు, మిరియాల పొడి,…

Thursday, 16 May 2024, 4:05 PM

Black Marks On Tongue : మీ నాలుక‌పై ఇలా ఉందా.. అయితే అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..!

Black Marks On Tongue : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో నాలుక కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు రుచిని…

Thursday, 16 May 2024, 11:30 AM

Cabbage Onion Pakoda : ఉల్లిపాయ ప‌కోడీల‌ను ఇలా క్యాబేజీతో క‌లిపి వెరైటీగా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Cabbage Onion Pakoda : ప‌కోడీలు అంటే చాలా మందికి ఇష్ట‌మే. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా ప‌కోడీల‌ను తింటే ఎంతో…

Wednesday, 15 May 2024, 8:20 PM

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి…

Wednesday, 15 May 2024, 3:39 PM

Mango Ice Cream : మామిడి పండ్ల‌తో ఎంతో టేస్టీ అయిన ఐస్‌క్రీమ్‌.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!

Mango Ice Cream : వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌నకు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తుంటాయి. వీటిని చాలా మంది…

Wednesday, 15 May 2024, 9:08 AM