స‌మాచారం

Soap : మీరు వాడుతున్న స‌బ్బు మంచిదేనా.. దాన్ని ఎలా గుర్తించ‌డం.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

Soap : శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు..? సబ్బు లేదా బాడీ వాష్. బాడీ వాష్ అనేది హై క్లాస్ వర్గీయులు ఎక్కువగా వాడేది. ఇక సబ్బు విషయానికి వస్తే దీన్ని అత్యధిక శాతం మంది వాడతారు. అయితే ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్పగలరు..? సదరు కంపెనీ ఇచ్చే యాడ్‌ని చూశా..? కాదు. అలా చెప్తే మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే లాభాపేక్ష కోసం కంపెనీలు ఎన్నో రకాల ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి.

అయితే సబ్బు ఎంత సమర్థవంతమైనది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది.. ఎలా తెలుసుకోవడం..? అందుకోసమే టీఎఫ్‌ఎం అనే పదం ఉపయోగపడుతుంది. మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్క సారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా..? ఆ అదే..! అదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది. అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి..? టీఎఫ్‌ఎం అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్. అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుంద‌న్న‌మాట‌.

Soap

భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. 76 అంతకు మించి టీఎఫ్ఎం శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు. 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు. గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది. గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి.

ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి. సో, ఇక నుంచి మీరు సబ్బు కొనే ముందు దాని నురగను, సువాసనను చూసి కొనకండి. దాని ప్యాక్‌పై ఉన్న టీఎఫ్‌ఎం విలువను చూసి కొనండి. దీంతో మీ చ‌ర్మానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ర‌క్షించుకోవ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

Left Over Rice Puri : రాత్రి మిగిలిన అన్నంతో పూరీల‌ను ఇలా చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Left Over Rice Puri : మ‌నం సాధార‌ణంగా గోధుమ‌పిండితో, జొన్న పిండి, రాగిపిండితో రోటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము.…

Thursday, 2 May 2024, 8:40 PM

Hibiscus Gardening : మందార మొక్క‌ల‌కు ఇలా చేస్తే పువ్వులు గుత్తులుగా వ‌స్తాయి..!

Hibiscus Gardening : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన మొక్క‌ల‌ల్లో మందార మొక్క కూడా ఒక‌టి. మందార మొక్క మ‌న‌కు…

Thursday, 2 May 2024, 5:53 PM

Akshaya Tritiya 2024 : ఈ ఏడాది అక్ష‌య తృతీయ త‌రువాత నుంచి ఈ 3 రాశుల వాళ్ల‌కు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Akshaya Tritiya 2024 : అక్ష‌య తృతీయ‌.. దీనిని అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. హిందువులు, జైనులు ఈ…

Thursday, 2 May 2024, 3:49 PM

Bath : స్నానం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కూడ‌దు..!

Bath : మ‌నం శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డానికి రోజూ స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయ‌డం వల్ల మ‌న‌కు ఏదో…

Thursday, 2 May 2024, 12:14 PM

Foot Index Finger Longer Than Thumb : కాలి బొట‌న వేలి కంటే ప‌క్క‌న వేలు పొడుగ్గా ఉందా.. అయితే ఏం జ‌రుగుతుంది..?

Foot Index Finger Longer Than Thumb : మీ కాళ్ల వేళ్ల‌ను మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? కొంద‌రికి కాళ్ల…

Thursday, 2 May 2024, 7:54 AM

Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు ఉన్న‌వారు ఏం తినాలి.. ఏం తినకూడ‌దు..?

Kidney Stones : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల‌ల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను, మ‌లినాలను బ‌య‌ట‌కు…

Wednesday, 1 May 2024, 7:23 PM

Dogs : మ‌న‌కు జ‌ర‌గ‌బోయే కీడు కుక్క‌ల‌కు ముందే తెలుస్తుందా..? అవి ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి..!

Dogs : మ‌నం ఇంట్లో పెంచుకోద‌గిన జంతువుల‌ల్లో కుక్క‌లు కూడా ఒక‌టి. కుక్క‌ల‌ను చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.…

Wednesday, 1 May 2024, 3:13 PM

Hemoglobin Foods : ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. తినాల్సిన ఆహారం ఏమిటి.. తిన‌కూడ‌నివి ఏమిటి..?

Hemoglobin Foods : మ‌న‌లో చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒక‌టి. శ‌రీరంలో…

Wednesday, 1 May 2024, 9:30 AM