ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన శరీరంలో అనేక భాగాలకు క్యాన్సర్ వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటిగా మారింది. రోజూ ఎంతో మంది ఎన్నో రకాల క్యాన్సర్‌ల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఏడాది 3 లక్షలకు పైగా నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన సర్వేల్లో వెల్లడైంది. అంటే దీన్ని బట్టి చూస్తే క్యాన్సర్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ బాధితుల్లో నోటి క్యాన్సర్ బాధితులు 2 శాతం వరకు ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకు నోటి క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతున్నాయని వైద్యులు సైతం చెబుతున్నారు. అయితే అసలు నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది ? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ? ఎలా గుర్తించాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నోటి క్యాన్సర్ వస్తే దంతాలు లూజ్‌గా అనిపిస్తుంటాయి. నోట్లో ఎర్రని లేదా తెల్లని ప్యాచ్‌లు ఏర్పడుతాయి. నోట్లో పూత, భోజనం మింగడం, నమలడంలో నొప్పి ఉంటుంది. చెవి నొప్పి ఉంటుంది. నోట్లో గడ్డలు వస్తే కూడా ఈ వ్యాధి ఉందని గుర్తించాలి. నోట్లో వాపులు రావడం వంటివి క్యాన్సర్‌కు లక్షణాలుగా చెప్పవచ్చు. నోటి క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా రేడియేషన్ కారణమవుతుంది. అలాగే పర్యావరణ కారకాలు, ఆల్కహాల్‌లోని కెమికల్స్, గుట్కాలు లేదా పొగాకు నమలడం, పొగ తాగడం వంటివి నోటి క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతాయి. కనుక ఎవరిలో అయినా నోటి క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. దీంతో ప్రాణాలను కాపాడుకున్న వారు అవుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…