Laptop : మానవ శరీరమే నిజంగా ఓ చిత్రమైన నిర్మాణం. అది నిర్మాణమైన తీరును చూస్తే ఒక్కోసారి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఫలానా అవయవం అలాగే ఎందుకు నిర్మాణమైంది..? అనే సందేహం కలుగుతుంది. అలాంటి అవయవాల్లో చెప్పుకోదగినవి పురుషుల్లో ఉండే వృషణాలు. అవి శరీరంతోపాటు కాకుండా బయటికి ఉంటాయి. నిజానికి అవి అలా ఎందుకు ఉంటాయో తెలుసా..? దానికి, పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఉంటుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 98.6 ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది. అయితే వృషణాలకు మాత్రం ఇంత కన్నా 2 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ కావాల్సి ఉంటుంది. అప్పుడు వాటిల్లో వీర్యం తయారవుతుంది. దాని క్వాలిటీ బాగుంటుంది. అందులో ఉండే శుక్ర కణాలకు చక్కని కదలిక ఉంటుంది. ఎప్పుడైతే వృషణాలకు వేడి బాగా తగులుతుందో అప్పుడు వీర్యం నాశనమవుతుంది. ఉన్న కొద్దిపాటి వీర్యంలోనూ శుక్రకణాలు ఉండవు. ఉన్నా అవి చలించవు. దీంతో అలాంటి పురుషులకు పిల్లలు పుట్టరు. సాధారణంగా వేడి ప్రదేశాల్లో పనిచేసే పురుషులకు, అలాంటి ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి పిల్లలు త్వరగా పుట్టకపోవడానికి కారణం ఇదే.
అయితే వేడి ప్రాంతాల్లో ఉండడమే కాదు.. పిల్లలు పుట్టకపోవడానికి మరొక కారణం కూడా ఉంటుంది. అదే.. ల్యాప్‌టాప్, మొబైల్ రేడియేషన్, వేడి. ఈ రెండింటి నుంచి వచ్చే రేడియేషన్, హీట్ కారణంగా వృషణాల్లో ఉండే వీర్యం నశిస్తుంది. అందుకే మొబైల్ ఫోన్స్‌ను జేబుల్లో పెట్టుకోరాదని వైద్యులు చెబుతారు. ఇక ల్యాప్‌టాప్‌లనైతే ఏదైనా డెస్క్‌పై పెట్టుకుని పనిచేయాలి. అంతేకానీ ఒడిలో పెట్టుకుని పనిచేయకూడదు. ఎందుకంటే దాన్నుంచి వచ్చే వేడికి వీర్యం నాశనమవుతుంది. అలాంటప్పుడు పిల్లలు పుట్టరు. కనుక ఈ విషయంలో కూడా పురుషులు జాగ్రత్త వహించాల్సిందే. దీంతో వృషణాలు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. అలాగే పిల్లలు పుట్టేందుకు అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. కనుక ల్యాప్‌టాప్‌ల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సిందే.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…