Peanuts : పల్లీలని ఇష్టపడని వారుండరు. వేపుడు చేసుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనపడగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలను తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు.. పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు.. తాగితే సమస్యెందుకు వస్తుంది.. దానికి కారణాలు ఏంటి.. అనే విషయాలను తెలుసుకోండి.
పల్లీలలో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. అందువలన పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్‌తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. పల్లీలు తినగానే నీళ్లు తాగొద్దు అనడానికి గల మరో కారణం.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా ఉంటాయి కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. కనుక పల్లీలను తిన్న వెంటనే నీళ్లను తాగొద్దని అంటారు.
ఇక చివరిగా మరో కారణం ఏమిటంటే.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీంతో గ్యాస్, అజీర్ణం ఇబ్బంది పెడతాయి. కనుక పల్లీలను తినగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు వేచి ఉండడం ఉత్తమం. అప్పుడు కూడా వేడి నీరు తాగాల్సి ఉంటుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా జీర్ణమవుతుంది. ఇలా పల్లీలను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…