Cool Water : అసలే ఎండలు మండుతున్నాయి. బయట అడుగు పెడితే ఎండ వేడికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక ఆ సమస్య రాకుండా ఉండాలని కొందరు చల్లని డ్రింక్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇంకా కొందరు అస్తమానం చల్లని నీళ్లు తాగుతున్నారు. అయితే చల్లని నీటిని తాగితే హాయిగా ఉంటుంది, మండే ఎండల్లో అవి కచ్చితంగా మనకు దాహం తీరుస్తాయి. కానీ మీకు తెలుసా..? అసలు ఎండాకాలం అని కాదు, ఏ కాలంలో అయినా సరే చల్లని నీళ్లను తాగకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీళ్లు లేక వేడి నీళ్లను తాగాలి. అవును, మీరు విన్నది నిజమే. చల్లని నీటిని ఎందుకు తాగకూడదో, దాని వల్ల మనకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లని నీరు, కూల్‌డ్రింక్స్ తాగినపుడు అవి మన రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతేకాదు జీర్ణక్రియ సందర్భంగా సహజంగా జరిగే పోషకాల శోషణ కూడా సరిగా జరగదు. జీర్ణక్రియను పక్కనపెట్టి శరీర ఉష్ణోగ్రత, తాగిన నీటి ఉష్ణోగ్రతలను నియంత్రించే పనిలో శరీరం ఉంటుంది. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మనం మరీ చల్లని నీటిని తాగడం వల్ల మన శరీరం దీనిని నియంత్రించేందుకు ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. అందుకే రూమ్ టెంపరేచర్ (24 డిగ్రీల సెల్సియస్) ఉన్న నీటిని తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
తిన్న వెంటనే అతి చల్లని నీళ్లు తాగడం వల్ల ఒంట్లో ఉన్న అనవసర కొవ్వును తొలగించే ప్రక్రియకు కూడా ఆటంకం కలుగుతుంది. నిజానికి తినగానే అసలు నీళ్లు తాగొద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాతే, అది కూడా గోరువెచ్చిన నీళ్లు తాగాలన్నది డాక్టర్ల సలహా. చల్లని నీటిని తాగితే కొవ్వు తొలగించే ప్రక్రియ సరిగ్గా జరగని మూలంగా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. ఆ తరువాత అది ఎలాంటి అనారోగ్యాలకు దారి తీస్తుందో అందరికీ తెలుసు.
చల్లని నీటిని తాగితే గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దీన్ని పలువురు సైంటిస్టులు రుజువు చేశారు కూడా. చల్లని నీళ్లు పదో కపాల నాడి వేగస్‌ను ప్రేరేపిస్తాయి. నాడీ వ్యవస్థలో దీనిదే కీలకపాత్ర అవడం వల్ల చల్లని నీటిలోని తక్కువ ఉష్ణోగ్రతలు ఈ నాడిపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది. దీంతో రక్త సరఫరా సరిగా జరగదు. ఫలితంగా అవయవాలకు పోషణ సరిగ్గా అందదు. ఈ క్రమంలో వాటి ఎదుగుదల, నిర్మాణంపై ప్రభావం పడుతుంది.
వ్యాయామం చేసిన తర్వాత కూడా చల్లని నీళ్లు అస్సలు తాగకూడదు. ఓ గ్లాస్ వేడినీళ్లు తాగాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మనం వ్యాయామం చేసిన తర్వాత మన శరీరంలో చాలా వేడి పుడుతుంది. వెంటనే చల్లని నీళ్లు తాగితే రెండు ఉష్ణోగ్రతలకు పొత్తు కుదరక అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు అసలు ఆ నీటిని శరీరం గ్రహించదు కూడా. దీనివల్ల చల్లని నీళ్లు తాగి ప్రయోజనం ఉండదు. వర్కవుట్స్ చేసిన వెంటనే చల్లని నీళ్లు తాగిన కొంతమంది కడుపులో తీవ్రనొప్పి అని అంటుంటారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న శరీరానికి ఈ చల్లని నీళ్లు ఓ షాక్‌లాగా తగలడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక మనకు చల్లని నీళ్లు మంచివి కావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అయితే మరీ అతి చల్లగా ఉండే నీళ్లను తాగకూడదు. కానీ కాస్త చల్లగా ఉండేవి.. అది కూడా కుండలోనివి అయితే మంచిది. కుండలో నీళ్లు మరీ అంత చల్లగా ఉండవు. అందువల్ల వాటిని తాగవచ్చు. కానీ ఫ్రిజ్‌లలో ఉండే చల్లని నీళ్లను మాత్రం తాగరాదు. దీంతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక చల్లని నీళ్లను తాగే విషయంలో ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందుల పాలవుతారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…