Ghajini Movie : షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ పేషెంట్, ఒక టాప్ మొబైల్ బిజినెస్ మెన్, మంచి ప్రేమికుడు.. ఇలా విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ హీరో సూర్య అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో సూపర్ స్టార్ గా నిలిచాడు. ఏఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ అప్పట్లో నిజంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నయనతార, ఆసిన్ నటన టాప్. 2005 లో ఈ సినిమా షూటింగ్ మొదలై, రూ.10 కోట్ల బడ్జెట్ తో 90 రోజుల్లో పూర్తిచేశారు. ఇందులోని సాంగ్స్ అన్నీ సూపర్. ముఖ్యంగా హృదయం ఎక్కడున్నది పాట అప్పుడే కాదు, ఇప్పటికీ అందరి సూపర్ డూపర్ హిట్ సాంగ్ అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా చాలా మంది దగ్గరికి వెళ్లి చివరకు సూర్య దగ్గరకు చేరింది. ఎందుకంటే.. పదిహేను నిమిషాలకి తన గతాన్ని మర్చి పోయే హీరో పాత్ర అనగానే ఇబ్బందిగానే ఉంటుంది. పైగా హీరో గుండు చేయించుకోవాలి, డ్రాయర్ మీద నిలబడాలనేవి కూడా కథలో భాగం.
నిజానికి ఈ కథని తెలుగులో మహేష్ బాబుతో తీస్తే అదిరిపోతుందని మురుగుదాస్ భావించి హైదరాబాద్ వచ్చి మెగా నిర్మాత అల్లు అరవింద్ కి కథ చెప్పడంతో చాలా బాగుందని.. ఈ సినిమా చేద్దామని.. అయితే ముందు మహేష్ బాబుని ఒప్పించమని చెప్పారట. అయితే ఈ కథకు మహేష్ ఓకే చెప్పక పోవడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీద్దామని భావించారట. అయితే అప్పటికే జానీ ఫ్లాప్ తో కష్టాల్లో ఉండడంతో ఈ సినిమాకి పవన్ నో చెప్పేశాడు. అరవింద్ ఈ సినిమా చేస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పడంతో ఇక తెలుగులో కుదరదని తమిళ్ స్టార్ హీరోల వైపు మురుగుదాస్ కన్నేశాడు. కమల్ హాసన్ తో సహా దాదాపు 10 మంది హీరోలు నో చెప్పేశారు.
చివరకు తన మొదటి సినిమాలో హీరోగా చేసిన అజిత్ కి కథ చెప్పడం, ఆ కథ నచ్చడంతో మురుగుదాస్ టాప్ హీరో దొరికాడని ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే హీరోయిన్స్ గా ఆసిన్ అండ్ శ్రియాలను, విలలన్ గా ప్రకాష్ రాజ్ ని తీసుకొని ఈ సినిమాకి మిరత్తల్ అనే టైటిల్ తో అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. అయితే నాలుగు రోజులు షూటింగ్ జరిగాక ఎందుకో గానీ అజిత్ ఈ సినిమా చేయట్లేదని ప్రకటించాడు. దాంతో అప్పుడప్పుడే తమిళ్ లో స్టార్ అవుతున్న హీరో సూర్యని కలిసి గజని కథ వినిపించాడు. అలా ఒకే అయింది. అయితే అప్పటికే శ్రియ అండ్ ప్రకాష్ రాజ్ డేట్స్ అయిపోవడంతో వాళ్ళ ప్లేస్ లో నయనతార, ప్రదీప్ రావత్ లకు ఛాన్స్ దక్కింది. సూర్య చాలా కష్టపడి చేసిన నటనకు మంచి పేరు వచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…