ఆరోగ్యం

Curry Leaves : క‌రివేపాకుల‌తో ఎలాంటి రోగాల‌ను ఎలా న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Curry Leaves : మ‌నం రోజూ వంటల్లో ఉప‌యోగించే ప‌దార్థాల్లో క‌రివేపాకు కూడా ఒక‌టి. క‌రివేపాకుల‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే క‌రివేపాకుల‌ను కూర‌ల్లోంచి తీసిపారేస్తుంటారు. కానీ అలా ప‌డేయ‌రాదు. క‌రివేపాకుల‌ను తిన‌డం వ‌ల్ల మనం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌రివేపాకుల‌తో మ‌నం ఎలాంటి రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో.. వాటిని ఎలా ఉప‌యోగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. క‌రివేపాకులు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

కడుపులో తేడాగా రకరకాలుగా ఉంటే రెండు స్పూన్స్ కరివేపాకు రసంలో ఓ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పంచదార కలిపి తాగండి. ప్రశాంతంగా ఉంటుంది. కరివేపాకును పేస్ట్ లా చేసి ఒక స్పూన్ పేస్ట్ ని ఒక గ్లాస్ పలుచ‌ని మజ్జిగలో కలిపి అప్పుడప్పుడూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇలా వేస‌విలో తీసుకుంటే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరంలోని వేడి మొత్తం త‌గ్గిపోతుంది. అలాగే శరీర బరువును, రక్తంలో చక్కెరను తగ్గించే గుణాలు కరివేపాకులో అధికంగా ఉంటాయి. కాబట్టి వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నవారు రోజూ ఉదయం పది కరివేపాకులని నోట్లో వేసుకుని నేరుగా అలాగే న‌మిలి మింగాలి. దీంతో షుగ‌ర్ రాదు. షుగ‌ర్ ఉన్న‌వారు కూడా ఇలా చేస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.

Curry Leaves

కాలిన గాయాల మీద కరివేపాకు పేస్ట్ ని వేసి కట్టుకడితే త్వరగా తగ్గుముఖం పడతాయి. కరివేపాకు చెట్టుకి ఉండే కాయల నుంచి రసం తీసి రాస్తే పురుగులు కుట్టినచోట వచ్చే దద్దుర్లు తగ్గిపోతాయి. ఒక బౌల్ లో కొబ్బరినూనెలో కరివేపాకులు వేసి ఆకులు నల్లగా పొడి పొడి అయ్యేవరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తర్వాత చల్లార్చి పెట్టుకోండి. ప్రతిరోజూ ఈ ఆయిల్ ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం, నెరవడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.
కరివేపాకును పచ్చడిగానో లేక విడిగానో తిన్నా, లేదా దాని రసం మజ్జిగలో కలుపుకుని రోజూ తాగినా అది ఒంటికి చాలా మంచి చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు రావు. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇలా క‌రివేపాకుల‌తో మ‌నం ఎన్నో రోగాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. క‌నుక వీటిని రోజూ తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM