Hair Growth : ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోవడం వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి మొదలైన కారణాల వలన జుట్టు బాగా రాలుతోంది. జుట్టు రాలిపోవడం వలన రకరకాల పద్ధతుల్ని చాలా మంది పాటిస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా కొనుగోలు చేసి, వాడుతున్నారు. కొందరికి బట్టతల కూడా వచ్చేస్తోంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచగా అయిపోవడం వంటి సమస్యల నుండి బయట పడాలన్నా.. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ వంటివి లేకుండా ఉండాలన్నా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని మాత్రమే కాదు. మనం ఇంటి చిట్కాలను కూడా ట్రై చేయొచ్చు.
మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ఉపయోగం కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విధంగా మీరు పాటించారంటే, జుట్టు వారం రోజులలో ఆగకుండా పెరుగుతుంది. జుట్టు త్వరగా పెరగాలంటే, ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసేసి, శుభ్రంగా కడిగి తురుముకోవాలి. మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ అయినా చేయొచ్చు.
తర్వాత అల్లం ముక్కల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. లేదంటే పేస్ట్ చేసుకోవాలి. అల్లం, ఉల్లిపాయ పేస్ట్ ని కాటన్ క్లాత్ తో వడకట్టుకోండి. తర్వాత ఒక చెంచా నల్ల ఆముదం నూనె వేసుకోవాలి. అది లేకపోతే సాధారణ ఆముదాన్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ ని వేసుకోవచ్చు.
లేకపోతే ఒక చెంచా బాదం నూనె వేసుకున్నా సరే ఫరవాలేదు. వీటిని బాగా మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవాలి. అయితే కేవలం మాడుకి అప్లై చేస్తే సరిపోతుంది. కురులకి అప్లై చేయక్కర్లేదు. ఒక గంట సేపు అలా ఉండనిచ్చి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. తల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి. జుట్టు బాగా ఎదుగుతుంది. జుట్టు సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…