Gond Katira In Telugu : చాలామందికి అసలు ఈ బాదం జిగురు గురించి తెలియదు. బాదం జిగురు ఒక మంచి ఔషధ మూలిక అని చెప్పవచ్చు. బాదం జిగురు గురించి ఈ కాలం వాళ్లకి తెలియకపోయి ఉండొచ్చు. కానీ, పూర్వీకులు బాదం జిగురు ఎక్కువగా వాడేవారు. దీన్నే గోండ్ కటీరా అని కూడా అంటారు. బాదం జిగురు వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. ఎండాకాలంలో బాదం జిగురుని తీసుకుంటే, ఒళ్ళు చల్లబడుతుంది. దగ్గు మొదలైన సమస్యల్ని కూడా బాదం జిగురు తొలగిస్తుంది. బాదం చిగురుని ఉపయోగించడం వలన, ఎటువంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
ఎండాకాలంలో, వడదెబ్బ బాగా తగులుతూ ఉంటుంది. ఒంట్లో విపరీతమైన వేడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. బాదం జిగురుని తీసుకుంటే, కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను ఇది బాగా తగ్గిస్తుంది. డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు బాదం జిగురు తో దూరం అవుతాయి. బాదం జిగురు ని తీసుకుంటే, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.
డెలివరీ తర్వాత చాలామంది తల్లులు, సామర్థ్యాన్ని పొందాలని అనుకుంటుంటారు. బాదం జిగురుతో తయారు చేసిన లడ్డులు ని తీసుకోవడం వలన, పాల ఉత్పత్తి పెరగడంతో పాటుగా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పలు రకాల సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. బాదం జిగురుతో కేర్ వంటివి కూడా సులభంగా మనం తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు, నిమ్మరసం తీసుకుంటే కూడా చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు.
ఈ బాదం జిగురుతో, మనం డ్రింకులు వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. బాదం జిగురు తో తయారు చేసిన మిల్క్ షేక్ వంటి వాటిని పిల్లలకి కూడా ఇవ్వచ్చు. పిల్లలు కచ్చితంగా ఇష్టపడి తీసుకుంటూ ఉంటారు. ఒక గ్లాసు చల్లని పాలు తీసుకుని, రెండు టేబుల్ స్పూన్లు బాదం జిగురు, ఒక టేబుల్ స్పూన్ రోజు సిరప్ వేసి, కొంచెం పంచదార వేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…