Ginger And Lemon Water : వేసవికాలంలో ప్రజలు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, హైడ్రేటెడ్ గా ఉండడానికి నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొందరు నీటికి బదులుగా నిమ్మకాయ నీటిని తాగడానికి ఇష్టపడతారు. నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే సాధారణ నిమ్మకాయ నీటికి బదులుగా ఇందులో అల్లం వేసుకుని తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల వేసవిలో మనకు మరింత మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. అల్లం మరియు నిమ్మకాయ ఇవి రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
అల్లం మరియు నిమ్మకాయ నీటిని కలిపి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం మరియు నిమ్మకాయ నీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరంలో మలినాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా అల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నిమ్మరసం మరియు అల్లం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. వేసవి కాలంలో వచ్చే జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే అల్లం మరియు నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. జీవక్రియ పెరుగుతుంది. క్యాలరీలను కరిగించడంలో ఇవి రెండు కూడా అద్భుతంగా పని చేస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారు వీటిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అల్లం మరియు నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేసవిలో సూర్యరశ్మి కారణంగా చర్మం దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా తిరిగే వారు ఇలా అల్లాన్ని మరియు నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ విధంగా ఉదయం పరగడుపున అల్లం మరియు నిమ్మకాయ నీటిని కలిపి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ నీటిని తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…