Ghee In Belly Button : నెయ్యి వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నెయ్యిని రోజూ తినడం వల్ల మనం ఎన్నో పోషకాలను పొందవచ్చు. శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. క్యాలరీలు పెరుగుతాయన్న భయం కారణంగా నెయ్యిని మనలో చాలా మంది తినరు. కానీ ఆయుర్వేదం ప్రకారం నెయ్యిని వాడడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని వైద్యంలో ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని లోపలికి తీసుకోవడమే కాదు.. బొడ్డులోనూ వేయవచ్చు. అవును.. షాకింగ్ గా ఉన్నా ఇది నిజమే. ఈ క్రమంలోనే నెయ్యిని బొడ్డులో వేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిని బొడ్డులో వేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మం సంరక్షించబడుతుంది. ఆయుర్వేద ప్రకారం బొడ్డు అనేది పోషకాలను శోషించుకునేందుకు శరీరానికి ఒక ముఖ్య స్థానంగా భావిస్తారు. అందువల్ల అందులో నెయ్యి వేస్తే నెయ్యిలో ఉండే పోషకాలన్నీ మనకు లభిస్తాయి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. బొడ్డులో నెయ్యిని వేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఉండవు.
బొడ్డులో నెయ్యి వేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుంది. దీంతో టెన్షన్, ఆందోళన పోతాయి. నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఇలా నెయ్యిని బొడ్డులో వేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ విధంగా చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది అందరికీ పడకపోవచ్చు. కనుక డాక్టర్ పర్యవేక్షణలో ఇలా చేస్తే ఉత్తమం. అనుకున్న ఫలితాలను రాబట్టవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…