Foods For Brain Health : మనలో చాలా మంది పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేహ్యాలను, పొడులను వారికి ఇస్తూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే ఇవి ఖర్చుతో కూడుకున్నవి. అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీర ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో అదే విధంగా మనం తీసుకునే ఆహారం ద్వారా మన మెదడు కూడా చక్కగా పని చేస్తుందని, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన మెదడు నరాల సముదాయం. మెదడులోని నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, జ్ఞాపక శక్తి పెరగాలన్నా మన మెదడుకు మూడు ముఖ్యమైన పోషకాలు చాలా అవసరం. జింక్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ… ఈ మూడు పోషకాలు మన మెదడుకు చక్కగా అందితేనే మన మెదడు చక్కగా పని చేస్తుంది.
శరీరంలో జింక్ లోపించడం వల్ల మెదడు పని తీరు తగ్గుతుంది. మెదడు కణాల పనితీరు దెబ్బతింటుంది. గర్భిణీ స్త్రీలు జింక్ ను తక్కువగా తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల మెదడు నరాలు చక్కగా పని చేస్తాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లను తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం పాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మనం ఆలోచించినప్పుడు మెదడులో అనేక రకాల రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి మెదడు కణాల జీవితకాలాన్ని తగ్గిస్తాయి. మెదడు కణాలు త్వరగా నశించేలా చేస్తాయి. విటమిన్ ఇ ఈ రసాయనాల కారణంగా మెదడు కణాలు దెబ్బతిన్నకుండా యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని కూడా పని చేస్తుంది. కనుక ఈ మూడు పోషకాలు కలిగిన ఆహారాన్ని పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. మనకు 7 నుండి 10 మిల్లీ గ్రాముల జింక్ అవసరమవుతుంది.
పొద్దు తిరుగుడు పప్పు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, జనపనార విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే జింక్ లభిస్తుంది. అలాగే మన శరీరానికి 1 నుండి 1.6 మిల్లీ గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒకరోజుకు అవసరమవుతాయి. వాల్ నట్స్ లో, చేపలల్లో, అవిసె గింజలు,చియా విత్తనాలు వంటి ఆహారాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఒక రోజుకు మన శరీరానికి 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. హజల్ నట్స్, బాదం పప్పు, పొద్దు తిరుగుడు పప్పు వంటి వాటిలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను పిల్లలకు తరుచుగా ఇవ్వాలి. అలాగే వారితో ప్రాణాయామం చేయించాలి. ఇలా చేయడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…