Oven : ఒకప్పుడంటే కాదు గానీ ఇప్పుడు చాలా మంది బేకరీ పదార్థాలకు అలవాటు పడిపోయారు కదా. అంతేకాదు, ఇంకా కొందరైతే చికెన్, మటన్, ఫిష్ లేదా ప్రాన్స్.. ఇలా ఏ నాన్‌వెజ్ వెరైటీ తీసుకున్నా వాటిని గ్రిల్, కబాబ్స్ రూపంలో తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఈ ఆహార పదార్థాలను తింటున్న చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తమ తమ ఇండ్లలోనే మైక్రోవేవ్ ఓవెన్లను పెట్టుకుని దాంతో ముందు చెప్పిన విధంగా అన్ని ఫుడ్స్‌ను తయారు చేసుకుని ఎంచక్కా తింటున్నారు. కానీ మీకు తెలుసా..? అలా మైక్రోవేవ్ ఓవెన్స్‌లో వండిన లేదా వేడి చేసిన ఆహార పదార్థాలను తినకూడదని..? అలా తింటే ఎన్నో రకాల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నవారమవుతాం. ఈ క్రమంలోనే మైక్రోవేవ్ ఓవెన్స్ వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోవేవ్ ఓవెన్స్ లో ఏదైనా ఆహారాన్ని మనం వండుతున్నప్పుడు లేదా వేడి చేస్తున్నప్పుడు అందులో రేడియేషన్ వస్తుంటుంది. అయితే అది అంత పవర్‌ఫుల్ కాకపోయినా దాంతో మనకు సమస్యలే వస్తాయి. ఆ రేడియేషన్ బారిన పడితే గనక చర్మానికి, కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంతేకాదు.. ఈ రేడియో తరంగాలతో వండిన ఆహారం తిన్నా కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయట. మైక్రోవేవ్ ఓవెన్స్ లో వండిన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉండవు. పైగా వాటిని తింటే స్థూలకాయం, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులకు ఈ ఆహారం అస్సలు మంచిది కాదు.
మైక్రోవేవ్ ఓవెన్స్ లో ఆహారాన్ని ఏదైనా పాత్రలో పెడతారు కదా. అప్పుడు ఆ పాత్ర అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. దీంతో అన్ని దిక్కుల నుంచి రేడియో తరంగాలు వేడిని వెదజల్లుతాయి. అప్పుడు ఆహారం ఆటోమేటిక్‌గా వేడి అవుతుంది. అయితే ఆ ఆహారం అలా అటు ఇటు తిరగడం వల్ల అందులో ఉండే చిన్నపాటి అణువులలో బాగా తేడాలు వస్తాయట. ఈ క్రమంలో ఆ ఫుడ్ డెడ్ ఫుడ్ గా మారుతుందట. దాన్ని తింటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట.
ఆహార పదార్థాలను మైక్రోవేవ్ ఓవెన్స్ లో పెట్టేందుకు పలు రకాల ప్లాస్టిక్‌లతో చేసిన పాత్రలను ఉపయోగిస్తారు. అయితే ఆహారం హీట్ అయ్యే క్రమంలో సదరు ప్లాస్టిక్ పాత్రలలో ఉండే పాలీఎథిలీన్ టెరెఫ్తాలేట్ (పెట్), టోలీన్, బెంజీన్, బీపీఏ, జైలీన్ వంటి హానికర రసాయనాలు వేడి కారణంగా ఆహారంలోకి వెళ్తాయట. దీంతో ఆ ఆహారాన్ని తింటే శరీరంలోకి పెద్ద ఎత్తున విష పదార్థాలు చేరతాయట. అంతేకాదు, పలు రకాల క్యాన్సర్లు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందట.
మైక్రోవేవ్ ఓవెన్స్‌లో ప్రిపేర్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కొందరిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయట. ప్రధానంగా డిప్రెషన్, తలనొప్పి, మబ్బుగా ఉండడం, నిద్రలేమి, వికారం, ఆకలి మందగించడం, తరచూ మూత్రానికి వెళ్లడం, బాగా దాహం, దృష్టి సమస్యలు, కంటి సమస్యలు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, లింఫ్ గ్రంథుల వాపు తదితర సమస్యలు వస్తాయట. పాల సంబంధ పదార్థాలను మైక్రోవేవ్ ఓవెన్స్ లలో హీట్ చేసినప్పుడు వాటిలో 40 శాతం వరకు పోషకాలు హరించుకుపోతాయట. అంతేకాదు, వాటిలో ఈ.కొలి బాక్టీరియా వృద్ధి చెందుతుందట. దీంతో అలాంటి ఆహారం గనక తింటే డయేరియా, వాంతులు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
మైక్రోవేవ్ ఓవెన్ లలో వండిన ఆహారాన్ని ఎక్కువగా తినే వారిలో రక్తం తగ్గిపోతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీన్ని పలు పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. అందువల్ల ఓవెన్స్‌లో వండిన లేదా వేడి చేసిన ఆహారాలను తీసుకునేముందు ఒక్కసారి ఆలోచించండి. లేదంటే అనారోగ్యాలకు స్వాగతం పలికిన వారు అవుతారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…