ఆరోగ్యం

Health Tips : ఈ 27 సూత్రాల‌ను పాటిస్తే చాలు.. ఆరోగ్యంగా ఉంటారు.. ఎలాంటి రోగమూ రాదు..!

Health Tips : ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య సతమతమయ్యే సగటు పౌరుడు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యంపై దృష్టి సారించడం ఒక్కోసారి కష్టతరమవుతోంది. అయితే కింద ఇచ్చిన పలు సింపుల్ టిప్స్‌ను రోజూ పాటిస్తే చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటి కోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయా సమయాల్లో మనం చేసే పనులు, తీసుకునే ఆహారం, నిద్ర తదితర రోజువారీ అంశాలపై కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు. ఎంచక్కా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

1. రోజుకు కనీసం 7.50 కిలోమీటర్లు (దాదాపు 10వేల స్టెప్స్) నడిస్తే చాలు. ఇందు కోసం అవసరమైతే స్మార్ట్‌ఫోన్, ఫిట్‌నెస్ బ్యాండ్ వంటి అధునాతన సాంకేతిక పరికరాల సహాయం తీసుకోవచ్చు. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో మార్పు వస్తుంది.

2. సాధారణంగా మనలో అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉంటారు. అయితే ఎక్కువ సేపు కూర్చుని ఉన్నా, కొద్దిగా విరామం దొరికితే ఎక్కువ సేపు నిలబడేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను దూరం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

3. నడిచినా, నిలబడ్డా ఒకే రకమైన శరీర భంగిమ వచ్చేలా చూసుకోండి. అదెలాగంటే పొట్ట లోపలికి, ఛాతి బయటికి ఉంటూ, భుజాలు వెనక్కి ఉండేలా, మెడ సరిగ్గా ఉండేలా భంగిమను అలవాటు చేసుకోండి. ఇది శరీరంలోని కొన్ని క్యాలరీలను కరిగించేందుకు ఉపయోగపడుతుందట.

4. చక్కని భంగిమతోపాటు శ్వాస కూడా సరిగ్గా పీల్చాలి. ఇది రొమ్ము కదలికలను మెరుగు పరుస్తుంది. దీంతో శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరిగా అంది ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. ఈ విధంగా చేయడం వల్ల శరీరానికి కొత్త శక్తి చేకూరుతుంది.

Health Tips

5. పైన పేర్కొన్న కేవలం నాలుగు సూత్రాలను నిత్యం పాటిస్తే వారానికి అరకిలో నుంచి కిలో వరకు బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం.

6. పైన తెలిపిన వాకింగ్‌తోపాటు వీలైతే వ్యాయామం, యోగా, వెయిట్ ట్రెయినింగ్ వంటివి రోజులో కొంత సమయం పాటు చేయవచ్చు. ఇవి శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగిస్తాయి.

7. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండండి. అయితే ఉపవాసం ఉండలేమనుకునే వారు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని కేవలం కొద్ది మొత్తంలో తీసుకునేందుకు ప్రయత్నం చేయండి.

8. ఖాళీ కడుపుతో, ఆకలిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలు కొనేందుకు వెళ్లవద్దు. ఎందుకంటే అది మీ చేత అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ కొనిపించేలా చేస్తుంది.

9. జంక్‌ఫుడ్, మసాలా ఆహారం, చక్కెరతో చేసిన పదార్థాలు, ఆయిల్ ఫుడ్ వంటి వాటిని వంటగదిలో నుంచి వీలైనంత వరకు తొలగించేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి మీకు ఎక్కువ క్యాలరీలను ఇస్తాయి. మళ్లీ వాటిని కరిగించాలంటే ఇంకా ఎక్కువ కష్ట పడాల్సి వస్తుంది. వాటికి బదులుగా బాదం పప్పు, వాల్‌నట్స్, పండ్లు, ఖర్జూరం వంటి వాటిని వంటగదిలో చేర్చండి. కొద్దిగా ఆకలిగా అనిపించినప్పుడు వీటిని కొంత మొత్తంలో తిన్నా అధిక క్యాలరీలు చేరవు. దీంతో ఆకలి కూడా వేయదు.

10. ఎంత తిన్నా ఇంకా ఆకలిగానే ఉంటే మళ్లీ ఆహారం తినకుండా దానికి బదులుగా నీరు లేదా గ్రీన్ టీ తాగండి. తరచూ ఇలా చేస్తే శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు. ఇది బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.

11. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపల వంటి పదార్థాలను వారంలో కనీసం 3 సార్లయినా తినాలి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.

12. ఆహారాన్ని అధిక మంటపై ఎక్కువ సేపు ఉడికించకూడదట. ఇలా చేస్తే అందులోని పోషకాలన్నీ ఆవిరైపోతాయి. ఎల్లప్పుడూ తక్కువ మంటపైనే ఆహారం వండాలి.

13. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలను వీలైనంత వరకు తగ్గించండి. కూల్‌డ్రింక్స్, కేక్‌లు, బిస్కెట్లు, స్వీట్లు, ఐస్‌క్రీమ్స్ వంటి వాటిని ఎంత వీలైతే అంత తక్కువగా తినాలి. ఉదాహరణకు ఒక పెద్ద కేక్ ముక్క తినాల్సి వస్తే అందులో 3 వంతు మాత్రమే తినండి. పెద్ద కప్పులో కాఫీ తాగాల్సి వస్తే అందులో సగం తగ్గించి తాగండి. ఇలా క్రమంగా చేస్తూ పోతే చక్కెరకు మీరే దూరమవుతారు.

14. కొబ్బరినూనె, అవకాడోలు, దేశీ నెయ్యి, కోడిగుడ్లు, పాలు వంటి వాటిని రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. వీటి వల్ల ఆరోగ్యానికి హాని ఏమాత్రం కలగదు. అలా చెప్పేవన్నీ అపోహలే.

15. రాత్రిపూట భోజనానికి, అనంతరం నిద్రకు మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థాయికి వస్తాయి. రాత్రి పూట తిన్న వెంటనే నిద్రిస్తే బ్లడ్ షుగర్ పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

16. శరీర బరువును బట్టి నిత్యం 1.4 గ్రా నుంచి 2 గ్రా. వరకు ప్రోటీన్‌లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది శరీరంలోని క్యాలరీలను కరిగించేందుకు, కొత్త కణజాలం ఏర్పడేందుకు ఉపయోగపడుతుంది.

17. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనానికి ముందు కొద్దిగా పచ్చి కూరగాయలను తినండి. దీంతో కడుపు నిండిన భావన కలిగి ఆటోమేటిక్‌గా మీరు తక్కువ భోజనం చేస్తారు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

18. ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా 1 లీటర్ నీటిని తాగాలి. ఇది శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.

19. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ వంటివి తాగకూడదు. ఎందుకంటే రాత్రి నుంచి ఉదయం వరకు దాదాపు 8 నుంచి 10 గంటల పాటు కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో కాఫీ, టీలు తాగితే వాటిలోని యాసిడ్లు పొట్టలోని లైనింగ్ (మ్యూకస్ పొర)ను దెబ్బతీస్తాయి. నీరు లేదా గ్రీన్ టీ వంటివి తాగిన తరువాతే కాఫీ, టీలు తాగడం ఉత్తమం.

20. మనలో అధిక శాతం మంది పొట్ట నిండినా, నిండకపోయినా అధికంగా తిండి తింటారు. అయితే ఇలా తినడం ప్రమాదకరం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు దీన్ని అస్సలు పాటించకూడదు. అయితే కడపు నిండిన భావన కలిగేందుకు కొద్దిగా ముందుగానే భోజనం ముగించడం ఉత్తమమైన పద్ధతి.

21. చిన్న సైజ్‌లో ఉన్న ప్లేట్లలో ఆహారం తినండి. ఎందుకంటే ఆ సైజ్‌లో ప్లేట్ ఉంటే వాటిలో కొద్దిగా ఆహారం ఉంచినా ఎక్కువ తింటున్నామేమోనన్న భావన కలుగుతుంది. దీంతో ఆటోమేటిక్‌గా భోజనం తగ్గించేస్తారు. పలువురు పరిశోధకులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా ధ్రువీకరించారు కూడా.

22. రోజులో ఎక్కువ సార్లు తల దువ్వుకునేందుకు యత్నించండి. దీని వల్ల తలలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. అంతేకాదు వెంటుక్రలు రాలిపోవడం, చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

23. ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండండి. ఇలా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడుతుందట. పలువురు సైంటిస్టులు ఈ విషయంపై పరిశోధనలు కూడా చేశారు.

24. మూడు నుంచి 4 నెలలకోసారి ఆరోగ్యవంతమైన వ్యక్తులైతే రక్తదానం చేయాలి. దీంతో కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు, రక్తదానం చేసినప్పుడల్లా దాదాపు 500 క్యాలరీలు ఖర్చవుతాయట. అంతేకాదు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయట. ఇది గుండెను కూడా సంరక్షిస్తుందట. బరువు కూడా తగ్గవచ్చట.

25. వీలు కలిగిన వారు స్టీమ్, సోనా బాత్ వంటివి చేయడంతోపాటు శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇది శరీరంలోని రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది.

26. నిద్రించే సమయంలో గదిలో వీలైనంత వరకు చీకటిగా ఉండేలా చూసుకోవాలి. దీంతో చక్కని నిద్ర పడుతుంది. వీలైతే ఐ మాస్క్‌లు ధరించవచ్చు.

27. రోజులో కనీసం 20 నిమిషాల పాటైనా మన శరీరానికి సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఆ రోజుకి కావల్సిన డి విటమిన్ మనకు అందుతుంది. విటమిన్ డి వల్ల మన ఎముకలు దృఢంగా మారడమే కాదు, దాదాపు 3వేల రకాల కణాలకు శక్తి అందుతుంది.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM