Egg Shells Benefits : కోడిగుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ప్రతి ఒక్కరికి తెలుసు. కోడిగుడ్లని తీసుకుంటూ, ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా, కోడిగుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అయితే, కోడి గుడ్డే కాదు. కోడి గుడ్డు పెంకుతో కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కోడి గుడ్డు పెంకుతో లాభాలా..? పనికిరాదని పారేస్తాం కదా వాటి వల్ల లాభం ఏంటి అని షాక్ అవ్వకండి. నిజంగా వీటి వలన, అనేక లాభాలు ఉన్నాయి. గుడ్డు తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి.
డాక్టర్లు రోజుకి ఒక గుడ్డు తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే, గుడ్డు తినేటప్పుడు పెంకు ని కచ్చితంగా అందరూ పారేస్తూ ఉంటారు. అయితే, అది తప్పు. ఎందుకంటే గుడ్డు పెంకులుతో కూడా, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. గుడ్డు పెంకులని నేరుగా తినేయకూడదు. గుడ్డు పెంకుల్ని నీటిలో వేసి, బాగా మరిగించి, ఆరబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఒక చిన్న స్పూన్ తో తీసుకుంటే, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పావు స్పూన్ లో, సగం తీసుకుంటే సరిపోతుంది. గుడ్డు పెంకులులో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మీరు, ఈ పొడిని నీళ్ళల్లో కానీ, పాలల్లో కానీ వేసుకుని తీసుకోవచ్చు.
ఇలా, నీళ్లలో కానీ పాలల్లో కానీ, ఈ పొడిని కలుపుకుని తాగితే, ఎముకలు, దంతాలు, కండరాలు దృఢంగా మారుతాయి. ఎముకలు, కండరాలు సమస్యలు రావు. కాబట్టి, ఇలా గుడ్డు పెంకులు పొడిని తీసుకోవడం మంచిది. ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా బాగా తగ్గిపోతాయి.
ఈ పొడి తో పళ్ళు తోముకుంటే, పళ్ళు పచ్చగా ఉంటే, తెల్లగా మెరిసిపోతాయి. ఈ గుడ్డు పొడిని తీసుకోవడం వలన, చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా తగ్గుతుంది. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఈ పెంకులు పొడిలో విటమిన్ డి ఉంటుంది. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఈ పొడిని లిమిట్ గానే తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…